Sunday, August 30, 2026
HomeLATESTRishab Shetty :రిషబ్ శెట్టి సెన్సేషనల్ రికార్డ్.. ఇండియాలోనే ఫస్ట్ యాక్టర్‌గా..!

Rishab Shetty :రిషబ్ శెట్టి సెన్సేషనల్ రికార్డ్.. ఇండియాలోనే ఫస్ట్ యాక్టర్‌గా..!

Rishab Shetty :కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రిషబ్ శెట్టి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

on
- Advertisement -banner Ad

Rishab Shetty :రిషబ్ శెట్టి.. ఇది ఒక పేరు అనుకుంటే పొరపాటు. కన్నడ ప్రజల ఎమోషన్. రిషబ్ శెట్టి అనే పేరు ‘కాంతారా’ సినిమాతో మారుమోగిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కన్నడ చిత్రం ‘కాంతారా’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే. టాలెంట్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని, తనదైన ఫాలోయింగ్‌తో ముందుకు వెళుతున్న రిషబ్ శెట్టి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశారు.

ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలెబ్రిటీల జాబితాలో చోటు:

ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలెబ్రిటీల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. దీనితో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కేవలం నటనలోనే కాదు, దర్శకత్వం, అటు రచన.. ఇలా మూడు విభాగాలలో ఆయన సాధించిన ప్రతిభకు గాను ఈ అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మరొకసారి మారుమోగిపోతుంది. ఒక మనిషికి ఎన్ని టాలెంట్స్ అంటూ జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement

ఒకే సమయంలో మూడు విభిన్నమైన విభాగాల నుంచి దేశంలో ఎంపికైన ఒకే ఒక్క నటుడిగా రిషబ్ శెట్టి(Rishab Shetty) రికార్డ్ సృష్టించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఏ భారతీయ నటుడికి ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదు. ఈ రేర్ ఫీట్ సాధించిన రిషబ్ శెట్టి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆయన ప్రతిభకు దక్కిన గౌరవం ఇదే అంటూ రిషబ్ శెట్టి ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు.

also read:Vishnu Priya:బాల్కనీలో వయ్యరంగా అలా..కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ హాట్ పిక్స్!

- Advertisement -
Advertisement

నటనతో పాటు దర్శకత్వం, రచనలోనూ సత్తా:

రిషబ్ శెట్టి కేవలం నటననే కాదు, దర్శకత్వం, అటు రచనలో కూడా తనదైన స్టైల్‌తో ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు. జనాలను ఎలాంటి సినిమాలతో ఆకట్టుకుని ఎంటర్‌టైన్ చేయాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అనే విషయాలు రిషబ్ శెట్టికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయనను జనాలు బాగా నమ్ముతూ, ఆయన తెరకెక్కించే సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.

also read:Aakali Rajyam:యూత్‌ను ఊపేస్తున్న ట్రెండింగ్ సిరీస్ ఇదే!

- Advertisement -
Advertisement

‘జై హనుమాన్’లో హనుమంతుడిగా..:

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో ఆయన కూడా భాగమయ్యారు. హనుమంతుడు పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఈ పాత్ర ద్వారా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరో రెండు తెలుగు సినిమాలకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.‘జై హనుమాన్’ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిషబ్ శెట్టి పేరు ఎక్కడికో వెళ్లిపోతుంది అంటూ ఫ్యాన్స్ ముందునుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు.

‘ఘట్టం’లో కీలక పాత్ర:

దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘట్టం: ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమాలో ఆయన కీలక రోల్ ప్లే చేయబోతున్నారు. శివాజీ మహారాజ్‌గా కనిపించేందుకు ఫుల్ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.సోషల్ మీడియాలో ఇప్పుడు రిషబ్ శెట్టి అందుకున్న ఘనత సెన్సేషన్‌గా మారింది. ఇండియన్ హిస్టరీలోనే ఇది ఒక సెన్సేషనల్ రికార్డ్ అంటూ రిషబ్ శెట్టి పేరుని బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you