Balayya vs Nagarjuna:టాలీవుడ్ లో సినీ సెలబ్రిటీల మధ్య సినిమా రిలీజ్ వార్ అనేది కచ్చితంగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఎక్కువగా బాలయ్య, చిరంజీవి మధ్య ఈ వార్ కొంతకాలంగా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు క్రిస్మస్ 2026 పండుగకు సంబంధించి ఇద్దరు బడా హీరోల మధ్య గట్టి వార్ కనిపించబోతోంది. ఈ పండుగ సీజన్ అంటే చాలు పెద్ద హీరోల సినిమాలకు చాలా కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా సెలవులు ఉండడంతో థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య పెరుగుతుందని, అందుకే అప్పుడు సినిమాలను విడుదల చేసుకోవాలని టార్గెట్ చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కూడా కలిసి వస్తుందని భావిస్తుంటారు.
క్రిస్మస్ రేసులో బడా హీరోలు..
అయితే ఈసారి క్రిస్మస్ రేసులో చాలా సినిమాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 111 చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అలాగే నాగర్జున నటిస్తున్న కింగ్ 100వ చిత్రం కూడా అదే తేదీనే లాక్ చేసినట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు సీనియర్ హీరోల మధ్య వార్ గట్టిగానే ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. బాలకృష్ణ నటిస్తున్న NBK 111 చిత్రం పైన అభిమానులకు భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇటీవల బాలకృష్ణకు గాయం అవ్వడం చేత కొంత సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనే విధంగా వినిపించాయి. కానీ రిలీజ్ తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
also read:Rishab Shetty :రిషబ్ శెట్టి సెన్సేషనల్ రికార్డ్.. ఇండియాలోనే ఫస్ట్ యాక్టర్‌గా..!
థియేటర్ల పంపకంలో కొత్త చర్చ..
ఇదే సమయంలో నాగార్జున కెరియర్ లో చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం కింగ్ 100వ చిత్రం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు చిత్ర బృందం. ఈ చిత్రాన్ని రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కూడా అభిమానులు అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఇద్దరు సీనియర్ హీరోలు(Balayya vs Nagarjuna) ఒకే రోజున తమ సినిమాలతో వస్తే ప్రధానంగా థియేటర్ల కేటాయింపు పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని సైతం భావిస్తున్నారు . ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ షేరింగ్ విషయం చాలా కీలకంగా ఉండనుంది.
also read:Vishnu Priya:బాల్కనీలో వయ్యరంగా అలా..కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ హాట్ పిక్స్!
షారుక్ ఖాన్ కింగ్ కూడా అప్పుడే..
రెండు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఒకే రోజున విడుదల చేయడం షోల సంఖ్య, థియేటర్ల సంఖ్య విషయంలో పోటీ తప్పేలా కనిపించడం లేదు. అలాగే వీటికి తోడు బాలీవుడ్లో షారుక్ ఖాన్ నటించిన కింగ్ సినిమా కూడా క్రిస్మస్ పండుగనే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కూడా పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవే కాకుండా డిసెంబర్ 18న మార్వెల్ స్టూడియో నుంచి మరో సినిమా కూడా రాబోతోంది. హాలీవుడ్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడి చూస్తుంటారు. ఇలా మొత్తం మీద చూస్తూ ఉంటే క్రిస్మస్ పండుగని చాలా సినిమాలు టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.




