RAW NTR: కొద్దిరోజులుగా సోషల్ మీడియా వర్గాలల్లో హాట్ టాపిక్ గా మారిన “రా ఎన్టీఆర్”(RAW NTR) సంస్థ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించి వార్తల్లో నిలిచిన ఈ సంస్థ ఇకపై తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. “విజయం సాధించిన వారందరికీ మా అభినందనలు” అనే వ్యాఖ్యలు కూడా జోడించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
ఊరు-వాడ కార్యక్రమంతో ప్రారంభమైన వివాదం:
కొన్ని వారాల క్రితం రా ఎన్టీఆర్ సంస్ధ “ఊరు-వాడ” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రకటించింది. ఇందుకోసం సుమారు 100 కోట్లతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత తమిళ హీరో విజయ్ అభిమాన సంఘాలు రాజకీయాల్లోకి రాకముందు నిర్వహించిన సేవా కార్యక్రమాలతో దీనిని పోలుస్తూ ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ కూడా భవిష్యత్తులో అదే తరహాలో అడుగులు వేయనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి
ALSO READ: Balakrishna:బాలయ్య ఆరోగ్యంపై ఏఐజి ఆసుపత్రి హెల్త్ బులిటెన్..
ఎన్టీఆర్ బృందం స్పష్టీకరణ.. అభిమానుల వ్యతిరేకత:
ఈ ప్రచారం ఊపొందుకోవడంతో ఎన్టీఆర్ పిఆర్ బృందం స్పందించింది. “రా ఎన్టీఆర్ సంస్థకు హీరో ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదని” స్పష్టం చేసింది. అలాగే అధికారిక అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంస్థ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సాయి రూప్ వ్యాఖ్యలు.. చివరకు కార్యకలాపాలు ముగింపు:
వివాదాల నడుమ సంస్థ ప్రతినిధి సాయి రూప్ హైదరాబాద్, తిరుపతిలో మీడియా సమావేశాలు నిర్వహించి..” గత ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని.. తమతో 40 వేల మంది వాలంటీర్లు ఉన్నారని.. అంతే కాదు ఎన్టీఆర్ చెప్పినా మేము ఆగం ఊరు-వాడ కార్యక్రమం కొనసాగుతుందని వ్యాఖ్యానించడం మరింత వివాదానికి దారితీసింది. తారక్ ఎందుకు మాట్లాడడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు.
ALSO READ:Shivani Nagaram: చీరకట్టులో నడుము అందాలతో సెగలు పుట్టిస్తున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ!
ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారని ఇలాంటి చర్యలు హీరో ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని అభిమానుల అభిప్రాయపడ్డారు. అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేక స్పందన రావడంతో చివరకు “రా ఎన్టీఆర్ సంస్థ” తమ కార్యకర్తలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రస్తుతం టాలీవుడ్ లో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రధాన చర్చగా మారింది.
https://x.com/RAWNTR/status/2079942024497975331?s=20




