Bigg boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఈ షో సక్సెస్ఫుల్గా పదో వారం ఇటీవల పూర్తి చేసుకుంది. అయితే ఈ పదవ వారం ఎలిమినేషన్ లో ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది. బిగ్బాస్ పదోవారం నామినేషన్ లలో ముఖేష్, త్రిగున్, దేవ్జానీ, నీతూ నటరాజన్, అమన్, వర్షిణి, శ్వేత, రాంప్రసాద్, నరేష్, సుధీర్, రామకృష్ణ, శివకుమార్ ఉన్నారు. అయితే వీరిలో ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం శివకుమార్ చాలా లీస్ట్ లో ఉన్నారు. అదేవిధంగా రామకృష్ణ, నీతూ మాస్టర్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా వినిపించాయి.
శ్వేతా నాయుడు ఎలిమినేట్..
రామకృష్ణ ఎలిమినేట్ అవుతారని , డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఈసారి శ్వేతా నాయుడు ఎలిమినేట్ కావడం కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఈమె రెమ్యునరేషన్ కి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఢీ రియాలిటీ షోతో గుర్తింపు సంపాదించుకున్న శ్వేతా నాయుడు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
also read:Jayasudha:జయసుధ కమల్ హాసన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా..?
అదే కారణమా?
మొదటినుంచి హౌస్ లో(Bigg boss 10) ఉన్న కంటెస్టెంట్లతో పోలిస్తే ఈమెకు ఓటు బ్యాంకింగ్ పెద్దగా కనిపించలేదు. ఇక హౌస్ లో వచ్చిన తర్వాత కూడా హౌస్ మేట్స్ తో ఇమడ లేకపోయింది. ఆటల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా కనిపించలేక పోయింది. ఆటలలో కూడా రాణించలేకపోవడం, హౌస్ మేట్స్ దృష్టిలో అటు ఆడియన్స్ దృష్టిలో ఈమె బలమైన ముద్ర వేసుకోలేకపోయింది. ఇటీవల మరో కంటెస్టెంట్ అమన్ శ్వేతాకు సన్నిహిత్యం పెరగడం , అర్ధరాత్రి ముచ్చట్లు పెట్టుకోవడం ఇతరత్రా కారణాల వల్ల శ్వేత నాయుడు పైన చాలా నెగిటివ్ ఏర్పడింది. దీంతో పదోవారం హౌస్ లో సభ్యులందరూ కూడా నామినేషన్ లో ఉండగా శ్వేతాకే తక్కువ ఓట్లు పడ్డాయి.
also read:Ramya Krishnan:బాహుబలి, నరసింహ సినిమా పాత్రలు వదులుకోవాలనుకున్న రమ్యకృష్ణ. !
రెమ్యూనరేషన్ ఎంత?
శ్వేతా నాయుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.. ఇక బిగ్ బాస్ హౌస్ లో 5 వారాల పాటు కొనసాగిన శ్వేతా నాయుడు పదో వారం ఎలిమినేట్ కావడంతో ఈమె వారానికి రూ.1.5 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే మాత్రం ఐదు వారాలకి గాను 7.5 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందుకు సంబంధించి శ్వేతా నాయుడు పూర్తి వివరాలను తెలియజేస్తారేమో చూడాలి మరి.




