Jayasudha:తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకుంది అలనాటి హీరోయిన్ నటి జయసుధ. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అతి చిన్న వయసు అనగా 12 ఏళ్లలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన సహజ నటనతో సహజ నటిగా పేరు సంపాదించింది జయసుధ. 50 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన జయసుధ వైవిద్యమైన పాత్రలు కూడా పోషించింది. ఒకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే.. మరొకవైపు తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించింది.
సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ..
సీనియర్ హీరోల అందరితో కలిసి నటించిన జయసుధ(Jayasudha).. బాలకృష్ణ ,చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారితో కూడా నటించింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గినప్పటికీ పలు చిత్రాలలో అమ్మగా, అత్తగా నటిస్తూ బిజీగా మారింది. ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలలో పెద్దగా కనిపించినప్పటికీ ఇంటర్వ్యూలలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. జయసుధ బాలీవుడ్ నటుడు నితిన్ కపూర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులో చిన్న కుమారుడు శ్రేయ హీరోగా నటిస్తూ ఉండగా, పెద్ద కుమారుడు పలు చిత్రాలలో నటిస్తున్నారు.
also read:Ramya Krishnan:బాహుబలి, నరసింహ సినిమా పాత్రలు వదులుకోవాలనుకున్న రమ్యకృష్ణ. !
కమలహాసన్ తో పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ..
2017లో జయసుధ భర్త మరణించారు. గతంలో జయసుధ పైన పలు రకాల రూమర్స్ వినిపించాయి. ప్రముఖ హీరో కమలహాసన్ తో రిలేషన్ లో ఉందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా అప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి. ఈ విషయం పైన ఓ ఇంటర్వ్యూలో జయసుధ ఓపెన్ గానే చెప్పేసింది.. తాను, కమలహాసన్ స్టేజ్ మీద కలిసి పాటలు పాడే వాళ్ళము. ఆయన పక్కన నిలబడితే నేను కూడా బాగా పాడేదాన్ని.. మేము ఎక్కువగా బాలచందర్ గారి సినిమాలలోనే కనిపించే వాళ్ళం.. ఆ రోజుల్లో పెద్ద వయసు ఉన్న హీరోలు ఉండేవారు. కమలహాసన్ మాత్రం చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా చిన్న ఏజ్ గా ఉండేవారు.
also read:Teja Sajja:నిశ్చితార్థం చేసుకున్న తేజ సజ్జా..తేజ సజ్జా కాబోయే భార్య ఎవరు?
స్నేహం తప్ప మరేం లేదు..
కమలహాసన్ ని చూసిన వారందరూ కూడా ఆయనని మెచ్చుకునే వారు. ఆ సమయంలో నేను హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాను.. నన్ను కూడా చాలామంది క్యూట్ గా పెద్దపెద్ద కళ్ళు వేసుకొని అందంగా కనిపిస్తోంది. ఎవరా హీరోయిన్ అని అనుకునేవారు.. అలా ఇద్దరి జంట కూడా బాగుండేదని ఎక్కడ చూసినా కూడా అనుకునేవారు.. అంతేతప్ప కమలహాసన్ నాకు మంచి మిత్రుడే అని అంతకుమించి ఏమీ లేదని విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం జయసుధ చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కమలహాసన్ ఇప్పటికీ హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. జయసుధ మాత్రం తమ పిల్లల భవిష్యత్తు పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది.




