ప్రముఖ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకునే ఈ హైదరాబాదు బ్యూటీ మరొకసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది.
అందులో భాగంగానే వైట్ కలర్ శారీ కట్టుకొని తొలకరి జల్లుల్లో తడుస్తూ చిరు ఆనందాన్ని పొందుతూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ఇక నిత్యం చీరకట్టులో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. మరొకసారి వైట్ చీరలో తడి అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా సిమ్రాన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
12 ఏళ్ల వయసుకే కమర్షియల్ యాడ్స్ ద్వారా కెరియర్ను మొదలుపెట్టి.. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఫెమినా మిస్ ఇండియా అవార్డును కూడా అందుకున్న ఈమె ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది 2 లో నటిస్తోంది.