Wednesday, July 15, 2026
HomeLATESTAnna Rajan:మార్ఫింగ్‌తో హీరోయిన్‌కు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ బ్యూటీ..!

Anna Rajan:మార్ఫింగ్‌తో హీరోయిన్‌కు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ బ్యూటీ..!

Anna Rajan:మలయాళ నటి అన్నా రాజన్ ఫోటోలను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

on
- Advertisement -banner Ad

Anna Rajan:సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సైబర్ వేధింపులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్ల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా మలయాళ నటి అన్నా రేష్మా రాజన్ కూడా ఇలాంటి సైబర్ దాడికి గురయ్యారు. తన ఫోటోలను అనుమతి లేకుండా అసభ్యకరంగా మార్పులు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిపై ఆమె కేరళ పోలీసుల సైబర్ సెల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

నా గౌరవాన్ని దెబ్బతీశారు.. అన్న ఆవేదన

ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందించిన అన్నా రాజన్(Anna Rajan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత గౌరవం, గోప్యతను దెబ్బతీసేలా ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం అత్యంత నీచమైన చర్య అని పేర్కొంది. ఇలాంటి కంటెంట్‌ను సృష్టించే వారితో పాటు దానిని షేర్ చేసేవారు కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించింది. అంతేకాదు, సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని, అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Simran choudhary: తొలకరి జల్లులలో తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న సిమ్రాన్!

ఇది మొదటి ఘటన కాదు:

అన్నా రేష్మా రాజన్ సైబర్ వేధింపులను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె దుస్తులు, శరీర ఆకృతిని లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేయడంతో పాటు బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రెండ్ చేస్తున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ AI ఆధారిత ఫోటో మార్ఫింగ్ ఘటనలు పెరుగుతుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:షో మధ్యలో షాకింగ్ కామెంట్..”వాడిని బయటకి పంపేయండి” అంటూ జడ్జి ఫైర్..!

అన్నా రేష్మా రాజన్ సినీ ప్రయాణం:

2017లో విడుదలైన “అంగమాలి డైరీస్” అనే చిత్రంతో అన్నా రేష్మా రాజన్ సినీ రంగంలోకి ప్రవేశించారు. దర్శకుడు లిజో జోస్ పెల్లిశెరి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమెపై జరిగిన సైబర్ వేధింపుల ఘటన మరోసారి డిజిటల్ భద్రత, మహిళల గోప్యతపై చర్చకు దారితీసింది.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/p/DaxCMSWtHCo/?hl=en

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you