Saturday, July 18, 2026
HomeLATESTJabardasth:ప్రభుత్వ ఉద్యోగం స్టార్ డం అందుకున్న కమెడియన్.. ఇప్పుడు బిగ్ బాస్ 10లోకి కూడా..?

Jabardasth:ప్రభుత్వ ఉద్యోగం స్టార్ డం అందుకున్న కమెడియన్.. ఇప్పుడు బిగ్ బాస్ 10లోకి కూడా..?

Jabardasth:ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి నటనపై మక్కువతో జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్ నూకరాజు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొంటారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Jabardasth:తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 9 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలో పదో సీజన్ తో సందడి చేయబోతుంది. ఇది ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో నిర్వాహకులు భారీ స్థాయిలో సరికొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి రూల్స్ బాగా మారిపోయిన్నట్లు టాక్. హౌస్ రూల్స్, టాస్కులు, గేమ్స్ తో పాటు కంటెస్టెంట్ లో ఎంపికలో కూడా పలు మార్పులు ఉండనున్నాయి అంటూ టెలివిజన్ వర్గాలలో చర్చ సాగుతుంది.

కంటెస్టెంట్లు జాబితా పై ఆసక్తి :

ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా బిగ్ బాస్ లో పాల్గొనే సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బుల్లితెర నటీనటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి కూడా హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్(Jabardasth) కి చెందిన వర్ష, పవిత్ర, వర్షిని, బుల్లెట్ భాస్కర్, మహిధర్ వంటి పలువురు కమెడియన్లు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్న నూకరాజు పేరు ఎక్కువగా హైలెట్ అవుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Vijay Sethupathi:ఫోన్ బూత్ ఆపరేటర్ నుంచి హీరో వరకు విజయ్ సేతుపతి కథ కన్నీళ్లు తెప్పిస్తుంది!

నూకరాజుకు బిగ్ బాస్ మంచి ఆహ్వానం :

ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నూకరాజు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. తన సహనటి ఆసియాతో కలిసి ఫోక్ సాంగ్స్ అదేవిధంగా ప్రైవేట్ ఆల్బమ్ లోను కనిపిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ నేపథ్యంలోనే అతనికి బిగ్ బాస్ 10 లోకి ఆహ్వానం వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అతనితో సంప్రదింపులు కూడా జరిగినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:ఈ శుక్రవారం మూవీ లవర్స్‌కు డబుల్ ట్రీట్.. థియేటర్లలో కొత్త సినిమాలు.. ఓటీటీల్లో క్రేజీ రిలీజ్‌లు!

పవర్ ప్లాంట్ ఉద్యోగ నుంచి స్టార్ కమెడియన్ వరకు :

విజయవాడకు చెందిన నూకరాజు తొలుత పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ షోలో తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అనంతరం జబర్దస్త్ లో తన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు సంపాదించాడు. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించే ముందు విజయవాడలోని పవర్ ప్లాంట్ లో ఉద్యోగం చేశాడు. అయితే నటనపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసేసి హైదరాబాద్ వచ్చి తన ప్రతిభతో బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలోకి ఆహ్వానం అందుకునేంత ఎత్తుకు ఎదిగిపోయాడు అంటూ జనాలు ఆయన టాలెంట్ ని ప్రశంసిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you