OTT Movie:ప్రతి వారం లాగే ఈసారి కూడా పలుభాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు, ప్రముఖ ఓటీటీ వేదికల్లోకి సందడి చేసేందుకు వచ్చేశాయి. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సమంత నటించిన “మా ఇంటి బంగారం”తో పాటు.. సాయి పల్లవి “ఏక్ దిన్”.. వడ్డే నవీన్ “ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు”.. దర్శన్ “ద డెవిల్”.. వంటి చిత్రాలు ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫాములలో సందడి చేస్తున్నాయి. ఇదే సమయంలో మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ “గేదెల రాజు(Gedela Raju Kakinada).. కాకినాడ తాలూకా”.. ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీలలో అందుబాటులోకి రావడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది.
కాకినాడ రాజకీయాల నేపథ్యంలో సాగే కథ:
ఈ ఏడాది ఏప్రిల్ లో థియేటర్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సినిమాని ఇది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంది అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇందులోని విలన్ పాత్ర కథలోని మలుపులు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. కధ కాకినాడ నేపథ్యంలో సాగుతుంది. భగవంత్ రాజు అనే రౌడీషీటర్ రాజకీయాలలోకి అడుగుపెట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే అదే స్థానానికి చెందిన దుర్గా కూడా పోటీ చేయడంతో ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. రాజకీయ నేపథ్యంలో కొన్ని కుల్లు, కుతంత్రాలు కూడా బయటపడతాయి . ఈ క్రమంలో భగవంత్ రాజు అనూహ్యంగా హత్యకు గురీవుతాడు. ఆ హత్య వెనక అసలు సూత్రధారి ఎవరు? హత్యకు కారణం ఏంటి..? ఆ కేసును పోలీసులు ఎలా చేదించారు..? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా ప్రధాన కథాంశం.
also read:Varanasi:‘వారణాసి’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. ‘మందాకిని’గా ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్!
ట్విస్టులు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్:
కథ సాధారణంగా అనిపించినప్పటికీ ప్రతి దశలో వచ్చే ట్విసులు ప్రేక్షకులను ఆసక్తికరంగా కట్టిపడేస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ పై బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ చాలా చాలా చక్కగా అనిపించింది. ప్రముఖ గాయకుడు రఘుకుంచే ప్రధాన పాత్రలో నటించగా.. వికాస్ ముప్పాల, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. చైతన్య మోటూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు . “చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు” అనే క్యాప్షన్ కి తగ్గట్టుగానే సినిమాలో ప్రతి సీన్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్లీపింగ్ అవుతుంది. థ్రిల్లర్ ,క్రైమ్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి వీకెండ్ వాచ్ గా నిలుస్తుంది. కచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరెందుకు ఆలస్యం థ్రిల్లర్ క్రైమ్ జోనర్ సినిమాలను లైక్ చేసే వాళ్ళు ఈ మూవీని వెంటనే చూసేయండి…!
also read:Tollywood: డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం.. ఎన్నికలు తప్పవా?




