Wednesday, August 26, 2026
HomeLATESTKriti Sanon:ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేసిన కృతి సనన్..!

Kriti Sanon:ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేసిన కృతి సనన్..!

Kriti Sanon: ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ ఇటీవల ఒక జువెలరీ యాడ్ కోసం బ్రాలెట్ బ్లౌజ్ తలపించేలా డ్రెస్ వేసుకొని కుక్కకు రాఖీ కట్టడంపై ట్రోల్స్ రాగా ఇప్పుడు వాటిపై ఆమె స్పందించింది.

on
- Advertisement -banner Ad

Kriti Sanon:ఇటీవల హీరోయిన్ కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ లో ధరించిన దుస్తులు, పెంపుడు కుక్కకు రాఖీ కట్టడం వంటి వాటిపైన చాలానే విమర్శలు వినిపించాయి. వీటి పైన కృతి సనన్ చాలా గట్టిగానే సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో స్పందించింది. ముఖ్యంగా సంస్కృతి, సాంప్రదాయాలను దుస్తులతో కొలవడం సరికాదు అని తెలిపింది. మహిళలు ఏం ధరించాలో ఇతరులే నిర్ణయిస్తారా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంలో ప్రముఖ నాటిక నాయకురాలిగా పేరు సంపాదించిన కంగన రనౌత్ కూడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసాయి.

రక్షాబంధన్ వివాదంపై స్పందించిన కృతి సనన్..

రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ ఆభరణాల బ్రాండ్ జీవా కోసం కృతి సనన్ ఆఫ్ వైట్ రంగులో ఇండో వెస్ట్రన్ దుస్తులలో కనిపించారు.. బ్రాలెట్ తరహాలో బ్లౌజు ధరించి స్కర్ట్ ధరించిన లుక్కులో కనిపించడంతో సోషల్ మీడియాలో కొంతమందికి నచ్చక మరి కొంతమంది తీవ్రంగా ఈమెను విమర్శించారు. సాంప్రదాయ భారతీయ పండుగను చూపించే ప్రకటనలో ఇలాంటి దుస్తులు సరిపోవు అని చాలామంది నెటిజన్స్ సైతం అభిప్రాయంగా తెలియజేశారు. అలాగే కుక్కకి రాఖీ కట్టడం పైన కూడా చాలా దారుణంగా ట్రోలింగ్స్ ఎదుర్కొంది.

- Advertisement -
Advertisement

also read:Spirit :వారణాసి VS స్పిరిట్ : సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ ఆన్సర్..

రక్షాబంధన్ అంటే అసలైన అర్థం అదే..

ఈ ట్రోలింగ్స్ పైన తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కృతి సనన్ (Kriti Sanon)స్పందించింది. పండుగలకు అసలు సారం మనం ధరించే దుస్తులలో ఉండదని.. సాంప్రదాయం అంటే.. బాగోద్వేగంలో వాటికి మనం ఇచ్చేటువంటి అర్థంలో ఉంటుందంటూ తెలిపింది. రక్షాబంధన్ అంటే కేవలం ఒక సోదరుడు సోదరిని రక్షిస్తారనే భావన మాత్రమే కాదు పరస్పరం ఒకరినొకరు అండగా నిలిచే ప్రేమ నమ్మకమే అంటూ వివరించింది.. తాను తన సోదరి నుపూర్ సనన్ ప్రతి ఏడాది ఒకరికొకరం రాఖీ కట్టుకుంటామని తెలియజేసింది కృతి సనన్. ఒకరి ఆరోగ్యం, సంతోషం దీర్ఘాయుష్షు కోసం మరొకరు ప్రార్థించుకుంటామంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:TV:బుధవారం టీవీలో వచ్చే సినిమాలివే..అన్నీ సూపర్ డూపర్ హిట్సే..!

కుక్కకు రాఖీ కట్టడంపై కూడా స్పందించిన కృతి సనన్…

తమ పెంపుడు కుక్కలు కూడా కుటుంబంలో భాగం కావడం చేత వాటిపైన ప్రేమతో రాఖీ కట్టడం తమకు సహజమైన విషయమే అంటూ కృతి సనన్ అంగీకరించింది. అలా తన మీద వచ్చిన విమర్శలకు సమాధానాన్ని తెలిపింది. కృతి స్పందనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మహిళా దుస్తులపైన సమాజం పెట్టే నిబంధనల గురించి ఆమె ఇలా స్పందించినట్లు కనిపిస్తోంది. ఫ్యాషన్ మారుతుందని సంప్రదాయ దుస్తులకు కొత్త రూపాలు తీసుకువస్తుందంటూ తెలియజేసింది. అలాగే కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కి కూడా ఘాటుగానే స్పందించింది.. కృతికి మద్దతుగా రాహుల్ గాంధీ మాట్లాడారు. కృతి చెల్లెలు కూడా స్పందించారు. కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి అంటూ కృతి సనన్ చెల్లెలు స్పందించింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you