Rajinikanth:టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్ లోని ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన క్లాసికల్ చిత్రాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ కెరియర్ లోనే తన రేంజ్ ను మార్చిన చిత్రాలలో భాషా సినిమా కూడా ఒకటి. ఇలాంటి చిత్రానికి సీక్వెల్ తీయాలని చాలామంది నిర్మాతలు రజనీకాంత్ వెంట పడ్డారు. కానీ రజనీకాంత్ మాత్రం భాషా, పేట చిత్రాలకు సీక్వెల్ తీయడానికి నో చెప్పారు కానీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న జైలర్ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 చిత్రాన్ని మాత్రం తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.
ప్రత్యేకించి జైలర్ 2 చేయడం వెనుక కారణం..
జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం వల్లే జైలర్ 2(Rajinikanth) చిత్రాన్ని ఒప్పుకున్నారని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదట అసలు ట్విస్ట్ కథలోనే దాగుందని చెబుతున్నారు. తాజాగా జైలర్ 2 సూపర్ షో కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ జైలర్ సినిమాకి సీక్వెల్ ఎందుకు చేయవలసి వచ్చిందో వెల్లడించారు. జైలర్ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత ఓటీటి లో తిరిగి మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు ఈ సినిమాలో ఉండే క్లైమాక్స్ భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ తాలూకా సీన్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కథ అక్కడే ముగిసి పోలేదని, దానికి సహజమైన కొనసాగింపు ఉంటుందని అప్పుడే గ్రహించానని తెలిపారు.
also read:The Paradise:ది ప్యారడైజ్ ఓటీటీలో భారీ మార్పులు!
అసలు విషయం చెప్పిన రజనీకాంత్..
ఆ వెంటనే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు తానే స్వయంగా ఫోన్ చేసి మరీ సీక్వెల్ కదా.. ఈ సినిమాలో ఇన్బిల్డ్ గా ఉంది మనం రెండవ భాగం చేద్దామని స్వయంగా చెప్పానంటూ రజనీకాంత్ తెలియజేశారు. కేవలం హిట్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసం.. అయితే కథ డిమాండ్ చేయడం వల్లే జైలర్ 2 సినిమా పుట్టిందంటూ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్లో కూడా టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో మరోసారి ఆకట్టుకోబోతున్నారు. ఒక శక్తివంతమైన అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ నుంచి తన కుటుంబాన్ని ఎలా ముత్తు వేల్ పాండియన్ కాపాడుకుంటారు, డ్రైవర్ అవతారంలో అండర్ కవర్ ఆపరేషన్ ని ఎందుకు మొదలు పెడతారు?! ఆయన గత జీవితం ఏంటి? పాత క్రైమ్ నెట్వర్క్ కి ఉన్న లింకులతో ఈసారి స్క్రీన్ ప్లే మరింత వైల్డ్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
also read:Kona Venkat:ఆ దర్శకులను బ్యాన్ చేయాలి.. కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు!
అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్..
జైలర్ 2 సినిమాని సన్ పిక్చర్ బ్యానర్ పైన భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబు, ఎస్ జె సూర్య, విద్యాబాలన్ , మిథున్ చక్రవర్తి, మిర్నా మీనన్ తదితర నటినటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే మోహన్లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ తో పాటుగా మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీలు కామియో పాత్రలు కనిపించబోతున్నారట. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. కథ మీద ఉండే నమ్మకంతో రజనీకాంత్ ఓకే చెప్పినా జైలర్ సికేల్ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.




