Monday, October 12, 2026
HomeLATESTThe Paradise:ది ప్యారడైజ్ ఓటీటీలో భారీ మార్పులు!

The Paradise:ది ప్యారడైజ్ ఓటీటీలో భారీ మార్పులు!

The Paradise: నాని హీరోగా, ది ప్యారడైజ్ సినిమా ఓటిటి వెర్షన్ లో భారీగా మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

The Paradise:నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ది ప్యారడైజ్. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ పైన అందరి దృష్టి పడింది. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని , ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

ఓటిటి కోసం భారీ మార్పులు..

ఇటువంటి తరుణంలోనే చిత్ర బృందం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాలలో మరింత ఆసక్తిని రేపేలా చేస్తోంది. ది ప్యారడైజ్(The Paradise) చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి కంటెంట్ పరంగా నెగిటివ్ రివ్యూలను ఎదుర్కొంది. ఫస్టాఫ్ పరవాలేదు అనిపించినా.. సెకండాఫ్ లో కథనం దారి తప్పిందని వినిపించాయి. ముఖ్యంగా సన్నివేశాల మధ్య పొంతన లేకపోవడం, కథను హఠాత్తుగా ఒక చోట నుంచి మరొక చోటికి తీసుకు వెళ్లడం వంటివి కనిపించడంతో ఎడిటింగ్ విషయంలో పొరపాటు జరిగాయని అందుకే కొన్ని సీన్స్ కి తగినంత సమయం కేటాయించలేకపోయారని, హీరో నాని స్వయంగా మీడియా ముఖంగా ఈ విషయాన్ని అంగీకరించడం జరిగింది.

- Advertisement -
Advertisement

also read:Kona Venkat:ఆ దర్శకులను బ్యాన్ చేయాలి.. కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

చిత్ర బృందం వివరణ ఇచ్చినా.. ఫలితం లేదు..

అలాగే ది ప్యారడైజ్ చిత్రంలో మితిమీరిన వయోలెన్స్, అలాగే గర్భిణీలపై చూపించిన రక్తపాత సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత అసహనానికి గురిచేసాయి. యాక్షన్ డోస్ పెరిగినంతగా.. బావోద్వేగ సన్నివేశాలు పండించలేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. ఇక హీరోయిన్ డబ్బు కోసం బి గ్రేడ్ చిత్రాలలో నటించడం, ఆ తర్వాత ఆమె సీన్స్ ని తల్లి స్వయంగా కెమెరాలో బంధించడం వంటి సీన్స్ కూడా అటు ప్రేక్షకులను అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపైన చిత్ర యూనిట్ ఎంత వివరణ ఇచ్చినా కూడా భారీగానే నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Allu Aravind:రాజమౌళి, అల్లు అరవింద్ మధ్య విభేదాలు.. అసలు కారణం ఇదేనా?

అందుకే మార్పులు.. వర్కౌట్ అయ్యేనా?

సాధారణంగా థియేటర్లలో సినిమా పెద్దగా ఆడకపోతే డిజిటల్ స్ట్రిమింగ్ విషయంలో మార్పులు చేసుకొని మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని ది ప్యారడైజ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఓటీటి లో నెగిటివ్ రివ్యూస్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో సినిమాలు చాలా మార్పులు చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా హింసాత్మకమైన దృశ్యాలను ఓటీటి వర్షన్ నుంచి పూర్తిగా తొలగించేలా ప్లాన్ చేస్తున్నారట. థియేటర్ రన్ కి ముందు నిడివి సమస్యల వల్ల పక్కన పెట్టిన కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ఓటీటి లో తిరిగి జోడించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ప్యారడైజ్ సినిమా కథనం వేగాన్ని పెంచి సీన్స్ మధ్య కనెక్షన్స్ కుదిరేలా ఒక సరికొత్త కట్స్ తరహా సినిమాను ఓటీటిలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది.. డిజిటల్ ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ప్యాచ్ వర్క్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఓటీటిలో వచ్చేవరకు ఆగాల్సిందే. నానికి జోడిగా కయాదులోహర్ హీరోయిన్గా నటించినది. మోహన్ బాబు విలన్ గా నటించారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you