Sunday, July 19, 2026
HomeLATESTNani:భారీ ధరకు నాని ది ప్యారడైజ్ నైజాం రైట్స్!

Nani:భారీ ధరకు నాని ది ప్యారడైజ్ నైజాం రైట్స్!

Nani: నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ నైజాం థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లూ సమాచారం.

on
- Advertisement -banner Ad

Nani:టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్ మరొకసారి జతకట్టడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ లో కూడా సరికొత్త రికార్డులను సృష్టించినట్లు తెలుస్తోంది.

ది ప్యారడైజ్ మూవీకి నైజాం ఏరియాలో భారీ బిజినెస్..

తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ది ప్యారడైజ్ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను మైత్రి మూవీ నిర్మాణ సంస్థ రూ. 37 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నాని (Nani)కెరియర్ లోనే ఇప్పటివరకు ఏ చిత్రానికి కూడా ఈ స్థాయిలో నైజాం బిజినెస్ జరగలేదు. దీంతో ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని, దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ సినిమాకి భారీగా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:72nd National Film awards: ఉత్తమ నటుడు ఎవరంటే?.. లిస్ట్ ఇదే..!

భారీ తారాగణం..

ఇక ఈ చిత్రానికి నిర్మాతగా సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రంగా రాబోతోంది. నాని ఈ చిత్రంలో మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. నానికి జోడిగా కాయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. విలన్ గా సీనియర్ నటుడు మోహన్ బాబు అలాగే బాలీవుడ్ నటుడైన రాఘవ్ జుమాల్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పాట కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది.

- Advertisement -
Advertisement

also read:Avika gor: ట్రెండింగ్ అవుట్ ఫిట్ లో హీట్ పుట్టించిన చిన్నారి పెళ్ళికూతురు.!

వాయిదా పడినా తగ్గని క్రేజ్..

బలమైన కథ, భారీతారాగణంతో తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎన్నోసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తూ ఉండడంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం నాని ప్యారడైజ్ సినిమాకి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారింది. ఇవే కాకుండా నాని చేతుల్లో మరో రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you