Sunday, July 12, 2026
HomeLATESTNTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కి పోటీగా ధనుష్ మరో మూవీ!

NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కి పోటీగా ధనుష్ మరో మూవీ!

NTR: సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడే హీరోలని చూసాము కానీ ఇప్పుడు ఒకే కథతో ఇద్దరు హీరోలు పోటీ పడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

on
- Advertisement -banner Ad

NTR:కొన్ని సందర్భాలలో మాత్రమే ఒకే టైటిల్ లేదా ఒకే సినిమా స్టోరీ ఉన్న చిత్రాలు ఇద్దరు హీరోలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలా కొన్ని సినిమాలు సక్సెస్ అయినా.. మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగిలాయి. ఇప్పుడు అలా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్ అనే చిత్రాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథతో రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్లో కార్తికేయుడు ఉత్తరాది నుంచి వచ్చాడు అంటూ ప్రస్తావించడం వంటి విషయాలపైన తమిళ డైరెక్టర్, రాజకీయ నాయకుడు సీమాన్ తీవ్రమైన విమర్శలు చేశారు.

ఎన్టీఆర్ కథతో ధనుష్..

కానీ ఇప్పుడు తాజాగా హీరో ధనుష్(DHANUSH), డైరెక్టర్ వెట్రిమారన్ క్రేజీ కాంబినేషన్లో ఒక భారీ అనౌన్స్మెంట్ చేశారు. గతంలో వీరు కలయికలో వచ్చిన వడ చెన్నై, ఆడుకాలం, పోల్లాదవన్ వంటి చిత్రాలు విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో భారీ అనౌన్స్మెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరి కాంబినేషన్లో తమిళ మురుగన్ అనే ఒక పవర్ఫుల్ టైటిల్ ని అనౌన్స్మెంట్ చేస్తూ తమ కాంబోలో ఇది ఐదవ చిత్రం అంటూ ప్రకటించారు. టైటిల్ తో పాటుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ కౌంట్ డౌన్ ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం గమనార్హం.

- Advertisement -
Advertisement

ALSO READ:Sai Pallavi:”డబ్బు, కారు కోసం ముద్దు”.. కిస్సింగ్ సీన్స్‌ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..!

సేమ్ స్టోరీ తో బాక్స్ ఆఫీస్ వద్ద వార్ తప్పదా?

ది ఎటర్నల్ ప్రొటెక్టర్ వారియర్, తమిళ ప్రజలు వారి నేల కి రాజు అయిన నాయకుడు తమిళ మురుగన్ అంటూ ధనుష్ కూడా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ గ్లింప్స్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది.ముఖ్యంగా యుద్ధ భూమిలో వేలాది మంది సైనికుల మధ్య ధనుష్ ఒక వారియర్ గా ఏనుగు పైన కూర్చొని మరి వస్తున్నట్లు చూపించారు. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయినట్టు కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Tollywood:అనుష్క మూవీ డైరెక్టర్ పై కేసు నమోదు!

ఇద్దరిలో మెప్పించేది ఎవరు?

మురుగన్ కు కుమారస్వామి, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే తమిళ మురుగన్ అనే టైటిల్ గ్లింప్స్ బట్టి చూస్తే ఈ సినిమా స్టోరీ కూడా ఆయన కథ అన్నట్టుగా అర్థమవుతోంది. ఇలా తమిళ ఇండస్ట్రీ నుంచి తమిళ మురగన్ సినిమా అని ప్రకటించి ఒక ఊహించని షాక్ ఇచ్చారు. స్టోరీ పరంగా రెండు చిత్రాలకు సంబంధం లేకపోయినా కానీ రెండు చిత్రాలు కూడా మురుగన్ లేదా కార్తికేయుడు దేవుడు అంశంతోనే ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మరి దీంతో అటు తమిళ మురగన్ గురించి తెలిసిన ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమాని ప్రకటించారా లేదా తెలుగులో మురుగన్ మూవీని తీయబోతున్నారని ప్రకటించడంతో ధనుష్ , వెట్రిమారం ఈ సినిమాని అనౌన్స్మెంట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇద్దరూ కూడా ఒకే దేవుడు ఎలిమెంట్తో సినిమా తీయడం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -
Advertisement


Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you