Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది కొత్త డైరెక్టర్లు కొత్త నటీనటులతో సరికొత్త సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్న వారు ఉన్నారు. అలా కొంతమంది డైరెక్టర్లు కొంతమంది నటీనటులను మోసం చేసి వార్తలలో నిలిచిన వారు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు టాలీవుడ్(Tollywood) లో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని చెప్పి, కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన గుడ్లూరి అశోక్ బాబు పైన ఈవోడబ్ల్యూ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
చీటింగ్ కేసులో ప్రముఖ డైరెక్టర్ పై కేసు ఫైల్..
ఈ వ్యవహారంలో ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన విజయలక్ష్మిని కూడా పోలీసులు విచారించబోతున్నారు. బాధిత యువకుడు తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. తన కుమారుడిని సినీ హీరోగా పరిచయం చేస్తానని డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు పలు దఫాలుగా తమ దగ్గర నుంచి రూ.3.5 కోట్ల రూపాయలు తీసుకున్నారని హనుమంతరావు ఫిర్యాదులో తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సినిమాను ప్రారంభించకుండా, తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడం లేదంటూ హనుమంతరావు ఫిర్యాదులో భాగంగా తెలియజేశారు.
also read:Mokshagna:నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్?
నమ్మించి మోసం చేసిన నేపథ్యంలో..
ఇక హనుమంతరావు సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు, ఇతర ఆధారాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు(gudluri ashok babu) సినీ పరిశ్రమలో మంచి దర్శకుడుగా పేరు సంపాదించారు. ఆయన తెరకెక్కించిన సినిమాల విషయానికి వస్తే.. పిల్ల జమిందార్, ఆకాశరామన్న, భాగమతి వంటి చిత్రాలు కలవు. ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ పైన ఇలాంటి ఆరోపణలు రావడం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
also read:Rashmika mandanna:అలాంటి అరుదైన రికార్డ్ సృష్టించిన రష్మిక!
డైరెక్టర్ స్పందిస్తారా?
ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉండడంతో అటు డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మి ఈ విషయం పైన ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. భాగమతి సినిమాలో అనుష్క నటించగా.. ఈమెకు కూడా ఈ సినిమాతో భారీ క్రేజ్ పెరిగిపోయింది. అనుష్క (anushka shetty) కెరియర్ లో ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.




