Monday, July 13, 2026
HomeLATESTLenin movie:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే సంచలన కలెక్షన్స్..ఎన్ని కోట్లు అంటే.. !

Lenin movie:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే సంచలన కలెక్షన్స్..ఎన్ని కోట్లు అంటే.. !

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే Lenin movie:ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసేలోపు రూ.50 కోట్ల మార్క్‌ను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది

on
- Advertisement -banner Ad

Lenin movie:అఖిల్ అక్కినేని తాజాగా నటించిన సినిమా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అఖిల్ తన కెరీర్ ప్రారంభించిన తర్వాత ఈ రేంజ్ అందుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా రెండో రోజు నమోదైన వసూళ్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటివరకు అఖిల్ కెరీర్‌లో ఇలాంటి కలెక్షన్లు ఎప్పుడూ చూడలేదంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో కలెక్షన్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

రెండో రోజు భారీ జంప్:

మొదటి రోజు ఈ చిత్రం రూ. 16.7 కోట్ల గ్రాస్ సాధించగా, రెండో రోజు అది ఏకంగా రూ. 20.5 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సాధారణంగా తొలి రోజు తర్వాత కలెక్షన్లు కొంత తగ్గడం కనిపిస్తూ ఉంటుంది. కానీ అఖిల్ విషయంలో అది పూర్తిగా మారిపోయింది. ‘లెనిన్'(Lenin movie) విషయంలో పూర్తి విభిన్నమైన పరిస్థితి కనిపించింది. పాజిటివ్ టాక్, మంచి పబ్లిసిటీ కారణంగా రెండో రోజు ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగి, వసూళ్లు గణనీయంగా పెరిగాయి.

- Advertisement -
Advertisement

also read:Vishnu Priya:”ఉద్యోగం లేదు..ప్లీజ్ రేట్ తగ్గించండి అక్కా”.. విష్ణుప్రియ రిప్లైతో నెటిజన్లు ఫిదా..!

వీకెండ్‌లో 50 కోట్ల మార్కు దాటే అవకాశం:

ఈరోజు ఆదివారం కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. దీంతో మూడో రోజు కలెక్షన్లు కూడా బలంగా నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే గనక జరిగితే తొలి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ మార్కును ‘లెనిన్’ సులభంగా దాటే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:OTT: శాపం వెనుక దాగిన రహస్యం.. ఓటీటీల్లో దుమ్మురేపుతున్న ‘త్రికాల’.. క్లైమాక్స్ వేరే లెవెల్..!

- Advertisement -
Advertisement

నిర్మాతల్లో ఆనందం.. నటీనటులపై ప్రశంసలు:

సినిమాకు వస్తున్న ఆదరణతో నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో ఈ చిత్రం కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. సునీల్, బ్రహ్మాజీ, శివాజీ, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. వీరి నటనతో పాటు భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అఖిల్ హిట్ కొట్టడమే కాదు, బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ కూడా సృష్టించేశాడు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you