Arya:తమిళ హీరోగా పేరు సంపాదించిన ఆర్య గురించి ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో చిత్రాలలో తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్య(Arya).. పలు సినిమాలలో విలన్ గా కూడా నటించారు. అయితే నటుడు ఆర్య పైన తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. అతనితో పాటుగా మినీ స్టూడియో, ది షో పీపుల్ సంస్థ పైన ఈ కేసు బుక్ అయినట్లుగా సమాచారం. అనంతన్ కాడు అనే చిత్రం కోసం రూ. 2.12 కోట్ల రూపాయల విలువైన ప్రొడక్షన్ పరికరాలను తీసుకొని తమకు కేవలం 42 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారంటూ ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
హీరో ఆర్య పై కేసు నమోదు..
అనంతన్ కాడు నిర్మాణ సమయంలో నటుడు ఆర్య చిత్ర నిర్మాత వినోద్ , నిర్మాణ సంస్థ ప్రతినిధులు చాలాసార్లు జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని తాహెర్ సినీ టెక్నిక్ సంస్థను సంప్రదించారట. తమకు లేటెస్ట్ డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లు, ఇతర నిర్మాణ పరికరాలు కావాలని అందుకు సంబంధించిన అద్దెని కూడా పూర్తిగా చెల్లిస్తామంటూ చెప్పారని.. అయితే ఇప్పుడు అడిగితే తమ దగ్గర ఎలాంటి బకాయిలు కూడా లేవని చెప్పారట. దీంతో గత ఏడాది ఫిబ్రవరి 25న ఈ అగ్రిమెంట్ చేసుకోవడంతో హైదరాబాద్ నుంచి కేరళకు పంపించారు.
also read:Rajinikanth:రజినీకాంత్‌పై ఉమ్మేసిన స్టార్ హీరోయిన్.. ఏళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ సీక్రెట్!
వస్తువులను వాడుకొని డబ్బులు చెల్లించని వైనం..
అయితే సినిమా పూర్తి అయ్యేవరకు వస్తువులను వాడుకొని ఒప్పందం ప్రకారం రూ.2.12 కోట్ల రూపాయలు చెల్లించలేదని ఇంకా రూ.1.80 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటూ ఆ సంస్థ అకౌంటెంట్ జావేద్ ఆలీ జూబ్లీహిల్స్ పోలీసులను సైతం ఆశ్రయించారు. సినిమా రిలీజ్ కు ముందు నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటామని చెప్పి, మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బకాయిల పైన చాలాసార్లు లేఖలు రాసినా.. మెసేజ్లు చేసినా.. కాల్స్ చేసినా కూడా స్పందన లేదంటూ ఫిర్యాదులో తెలియజేశారు.
హీరో ఆర్య ఇమేజ్ దెబ్బతింటోందా?
అంతేకాకుండా కేరళ కోర్టుని ఆశ్రయించి వారు వాస్తవాలను దాచిపెట్టి మరీ మధ్యంతర ఉత్తరులను తెచ్చుకున్నారంటూ ఆ బాధిత సంస్థ వాపోతోంది. పైగా బకాయిలను క్లియర్ చేయాలని , తమ సంస్థ మేనేజర్ వీరిని సంప్రదించినప్పటికీ హీరో ఆర్య , నిర్మాత వినోద్ , కిషోర్ వంటి వారు బెదిరిస్తున్నారని తెలియజేశారు . ఈ ఘటన పైన ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఇలాంటి విషయాల వల్ల హీరో ఆర్యకు ఇబ్బందులు తలెత్తుతాయని అభిమానులు సైతం వాపోతున్నారు. మరి ఈ విషయం పైన అసలు నిజం ఎవరు బయటపడతారో చూడాలి మరి.




