Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన అమీర్ ఖాన్ ఇటీవలే గౌరీ స్ప్రాట్ ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలా వివాహం చేసుకున్న రెండు మూడు రోజులకే కొత్త ఇంటికి సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశారు అమీర్ ఖాన్. ఆయన కుటుంబం మొత్తం ఒకే చోట నివసించేలా ముంబైలో చాలా విలాసవంతమైన ఇంటిని నిర్మించబోతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా రూ.100 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రచారం అయితే జోరుగా వినిపిస్తోంది.
100 కోట్లతో కొత్త ఇంటి నిర్మాణం..
వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన పాలిహిల్ ప్రాంతంలో బెల్లా విస్టా , మెరీనా అపార్ట్మెంట్లో అమీర్ ఖాన్ కొనుగోలు ఈ ఇంటిని చేసినట్లు వినిపిస్తోంది.. ఇందుకోసం ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని ప్రస్తుతం అక్కడ ఉన్న రెండు భవనాలను కూల్చివేసి ఒక విలాసవంతమైన ఆధునిక హంగులతో స్కై విల్లాను రూపొందించే ప్రణాళికలు అమీర్ ఖాన్ చేస్తూన్నట్లుగా తెలుస్తోంది. ఈ భవనంలో కుటుంబ సభ్యులు కలిసి నివసించేలా ప్రత్యేకంగా రూపకల్పనతో చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
also read:Jaya Krishna:మహేష్ కుటుంబం నుంచి కొత్త హీరో.. ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న జై కృష్ణ..!
కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉండేలా..
కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ప్రాంగణంలో ఉండాలని కుటుంబ సమావేశాలు వేడుకలు నిర్వహించేందుకు చాలా విశాలవంతమైన ప్రదేశాలను కూడా ఇందులోనే ఏర్పాటు చేసుకునేలా ప్లాన్ చేశారు అమీర్ ఖాన్. ఒక అంతస్తును ఇందులో పూర్తిగా ఫంక్షన్ హాలుగా ప్రత్యేకించి రూపొందిస్తూ ఉండగా.. మరొక అంతస్తును అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కోసం కేటాయించబోతున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్(Aamir Khan), తన భార్య గౌరీ , ఆమె మొదటి వివాహం ద్వారా కలిగిన కుమారుడుతో కలసి రెండవ అంతస్తులో నివసించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
also read:Arya:హీరో ఆర్య పైన కేసు నమోదు!
అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం..
అమీర్ ఖాన్ 1986 ఏప్రిల్ 18న మొదటి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పుడు అమీర్ ఖాన్ వయసు కేవలం 21 సంవత్సరాలేనట. తన మొదటి విడాకుల సమయంలో కూడా చాలా చిన్న వయస్కుడు అమీర్ ఖాన్. రీనా దత్త నుంచి విడిపోయిన అమీర్ ఖాన్ 2005లో కిరణ్ రావు ని వివాహం చేసుకున్నారు. అలా మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. గత రెండేళ్లుగా గౌరీతో డేటింగ్ లో ఉన్న అమీర్ ఖాన్ ఇటీవలే 61 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు.




