Wednesday, July 15, 2026
HomeLATESTOTT : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న థ్రిల్లర్ సినిమా.. చివరి 20 నిమిషాలు మైండ్ బ్లాంక్..!

OTT : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న థ్రిల్లర్ సినిమా.. చివరి 20 నిమిషాలు మైండ్ బ్లాంక్..!

OTT :అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్‌లో నిలిచిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సట్టెండ్రు మారుదు వానిలై' ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన కథ, సస్పెన్స్ ట్విస్టులతో ఆకట్టుకుంటోంది.

on
- Advertisement -banner Ad

OTT :ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. ఇందులో సమంత 100 కోట్ల సినిమా ‘మా ఇంటి బంగారం’, వడ్డే నవీన్ ఇచ్చిన ‘ట్రాన్స్‌ఫర్’, ‘త్రిమూర్తులు’ వంటి స్ట్రైట్ తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ‘సెకండ్ లవ్’, ‘రెడీ ఆర్ నాట్ 2’ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఓటీటీలో (OTT )మాత్రం ఓ సినిమా సూపర్ డూపర్ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఆసక్తికరమైన కథ ఈ సినిమాకు ఒక ప్లస్ అయితే, ఇందులో నటించిన నటీనటులు జీవించడం మరో ప్లస్ అని చెప్పాలి. ఈ మూవీకి ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు, చూసిన ప్రతి ఒక్కరూ కూడా “వావ్” అంటూ పొగిడేస్తున్నారు. మంచి రేటింగ్ కూడా ఉంది.

ఏ సినిమా అంటే..?:

ఈ సినిమా పేరు ‘సత్తేంద్రు మారుదు వానిలై’. (Sattendru Maarudhu Vaanilai)వానిలై బాబు విజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో జై ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాదు, మీనాక్షి గోవిందరాజు, యోగి బాబు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

- Advertisement -
Advertisement

అసలు కథ ఏంటంటే..?:

అనాథ అయిన హీరో ఒక రాజకీయ నాయకుడి కూతురితో ప్రేమలో పడతాడు. అసలు స్టోరీ అప్పుడే మొదలవుతుంది. కానీ ఆమె తండ్రి డబ్బు, పదవి కోసం ఓ ముసలి రాజకీయ నాయకుడికి రెండో పెళ్లి చేయాలని ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చి హీరోను పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడి నుంచే కథలో అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలకు తోడు, అమ్మాయి తండ్రి పంపిన రౌడీ మనుషులు ఈ కొత్త జంటకు నిద్ర లేకుండా చేస్తారు.

ALSO READ:Manvitha Jagadeesh:మోడల్ నుంచి స్టార్ సీరియల్ హీరోయిన్‌గా.. బుల్లితెర క్వీన్ మన్విత జగదీశ్ సక్సెస్ స్టోరీ..!

- Advertisement -
Advertisement

డార్క్ వెబ్ ట్విస్ట్..!:

ఈ మధ్యలో వాళ్ల మధ్య వచ్చిన తగాదాలు, అలాగే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వారు వేసిన ప్లాన్స్ ఆసక్తికరంగా సాగుతాయి. ఒక రిసార్ట్‌లో తలదాచుకున్న ఈ జంటకు అక్కడ మరో పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. ఆ రిసార్ట్‌లో ఓ వ్యక్తి డార్క్ వెబ్ కోసం అక్కడికి వచ్చే కపుల్స్ ప్రైవేట్ వీడియోలను దొంగతనంగా రికార్డ్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆ విలన్ కన్ను హీరో, హీరోయిన్‌పై పడుతుంది.

ALSO READ:NBK112:బాలయ్యకీ అన్నగా ఆ స్టార్ హీరో..కొరటాల శివ ప్లాన్ అదిరింది..?

- Advertisement -
Advertisement

చివరికి ఏం జరిగింది..?:

ఒకవైపు అమ్మాయి తండ్రి పంపించిన రౌడీలు, మరోవైపు డార్క్ వెబ్ మాఫియా… ఈ ఇద్దరి మధ్య కొత్త జంట ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటుంది. చివరికి ఈ కొత్త జంట ఎలా బయటపడింది? అసలు ఆ డార్క్ వెబ్ విలన్ ఎవరు? ఆ విలన్‌కు హీరో, హీరోయిన్‌తో సంబంధం ఏంటి? రాజకీయ నాయకుడిని హీరో, హీరోయిన్ ఏం చేశారు? ఫైనల్‌గా వీళ్ల ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు? అనేదే ఈ సినిమా కథ. అడుగడుగునా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా వేరే లెవెల్‌లో తీసుకెళ్తుంది. ఖచ్చితంగా సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you