Mrunal Thakur:2012లో హిందీ సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ,2014లో హలో నందన్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్గా పలు చిత్రాలలో నటించింది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). కానీ 2022లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సీతారామం చిత్రం ద్వారా ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది. గత కొంతకాలంగా మృణాల్ ఠాకూర్ లవ్ రూమర్స్ పైన పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ధనుష్ తో వార్తలు.. మరో స్టార్ క్రికెటర్ తో మృణాల్..
గడిచిన కొద్ది రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో డేటింగ్ చేస్తోందనే విధంగా వార్తలు వినిపించాయి. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే రూమర్స్ వినిపించినప్పటికీ ఈ విషయాలను కొట్టి పారేసింది మృణాల్ ఠాకూర్. అయితే ఇప్పుడు తాజాగా ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతోందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కూడా ఒకరినొకరు ఫాలో అవుతున్నారని, వీరి మధ్య ఏదైనా సంథింగ్ సంథింగ్ ఉందా అనే ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి
also read:Shrasti Verma:జానీ మాస్టర్ టీమ్ నాపై కక్ష కట్టారు.. శ్రష్టివర్మ షాకింగ్ కామెంట్స్
డేటింగ్ అంటూ కొత్త వార్తలు..
సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న కథనం ప్రకారం.. రిషబ్ పంత్ తన సోదరి తర్వాత ఇంస్టాగ్రామ్ లో మృణాల్ ఠాకూర్ నే ఫాలో అవుతున్నారని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఇద్దరి స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది డేటింగ్ వార్తలంటూ కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ విషయాన్ని ఇద్దరు కూడా అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ అభిమానులు మాత్రం ఎవరికి వారు తమ ఊహాగానాలతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
also read:Tollywood:ప్రభాస్-త్రిష పేర్లు మ్యాప్‌పై దర్శనం..! సోషల్ మీడియాలో ట్రెండింగ్..!
రిషబ్ పంత్ స్పందిస్తారా..
మృణాల్ ఠాకూర్ పై ఇలాంటి రూమర్స్ వినిపించడం ఇదేమి కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలానే వినిపించాయి. అలాగే రిషబ్ పంత్ కు కూడా ప్రముఖ నటి ఊర్వశీ రౌతేలా తో చనువుగా ఉన్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వార్తలను ఊర్వశి ఖండిస్తూ వచ్చినా.. తమ మధ్య ప్రేమ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ఈ రూమర్ కేవలం స్నేహానికి సంకేతమా లేక సోషల్ మీడియాలో కావాలని ఎవరైనా సృష్టించారా అనే విషయం తెలియాల్సి ఉంది.




