Wednesday, July 15, 2026
HomeLATESTShrasti Verma:జానీ మాస్టర్ టీమ్ నాపై కక్ష కట్టారు.. శ్రష్టివర్మ షాకింగ్ కామెంట్స్

Shrasti Verma:జానీ మాస్టర్ టీమ్ నాపై కక్ష కట్టారు.. శ్రష్టివర్మ షాకింగ్ కామెంట్స్

Shrasti Verma : ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ తాజాగా తనపై జానీ మాస్టర్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అంటూ ఆరోపణలు చేసింది.

on
- Advertisement -banner Ad

Shrasti Vermaతెలుగు డాన్స్ కమ్యూనిటీలో గత రెండు రోజుల నుంచి రెండు బలమైన వర్గాలుగా చీలిపోయాయి. ఒక వర్గం శేఖర్ మాస్టర్ మరొక వర్గం జానీ మాస్టర్ నాయకత్వం వహిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివాదం ఎందుకొచ్చింది అని చెప్పడానికి మాత్రం ఏవేవో కారణాలు చెబుతున్నారు. అసలు ఈ అసోసియేషన్, ఆ సంఘం ప్రెసిడెంట్ ఎన్నికల గురించి చెప్పుకోవాలి. తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు 2025 డిసెంబర్లో జరిగాయి. వాస్తవంగా ఆ ఎన్నికలు జరగడానికి ముందు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నది కూడా జానీ మాస్టర్.

అసోసియేషన్ లో గొడవలు..

ఆ తర్వాత జానీ మాస్టర్ పైన మరో లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Shrasti Verma) ఎపిసోడ్ జరగడంతో జానీ మాస్టర్ ఆ కేసులో జైలుకు వెళ్లడం, అనంతరం అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేయడం వంటివి జరిగాయి. ఇక అదే ప్లేసులో తన భార్య సుమలతను పోటీగా దించడం జరిగింది జానీ మాస్టర్. ఆ ఎన్నికలలో జానీ మాస్టర్ భార్య సుమలత ఒకవైపు, మరోవైపు భాను మాస్టర్, శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్ మరి కొంతమంది పెద్దవాళ్లు మరొకవైపుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా జానీ మాస్టర్ భార్య సుమలత ప్రెసిడెంట్గా గెలిచారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Tollywood:ప్రభాస్-త్రిష పేర్లు మ్యాప్‌పై దర్శనం..! సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

బెదిరిస్తున్నారు అంటున్న శ్రష్టివర్మ..

అలా సుమలత గెలిచినప్పటి నుంచి అసలైన వివాదం మొదలైనట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రెసిడెంట్గా సుమలత గెలిచినప్పటి నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, చాలామంది జనరల్ బాడీ సభ్యులు కూడా ఆరోపణలు చేశారు. ఎలాంటి విషయాలైనా సరే జనరల్ బాడీలో చర్చించి అక్కడ నిర్ణయించుకున్న తరువాతే ఏ విషయాలనైనా చెప్పాలని కానీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత మాత్రం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఆమె నిర్ణయాలను ప్రకటిస్తూ ఉండడంతో అసోసియేషన్ సభ్యులే ఆమె పైన మండిపడుతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:‘RAW NTR’తో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎన్టీఆర్ ఆఫీస్ టీమ్ షాకింగ్ స్టేట్‌మెంట్..!

కక్ష సాధింపులే కారణం అంటూ..

దీంతో ఏకంగా 10 మంది రాజీనామా చేయాల్సి వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలను తెలియజేసింది. అసోసియేషన్ సమావేశంలో జానీ మాస్టర్ అసిస్టెంట్లు కొందరు తన పైన దాడి చేశారని, ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. ఎలాంటి అవినీతికి పాల్పడని ఈసీ మెంబర్లను టార్గెట్ చేయడం సరైనది కాదు అని, అలాగే తన పైన వ్యక్తిగతంగా కక్ష సాధింపులు చేస్తున్నారంటూ శ్రష్టివర్మ తెలియజేసింది. బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చిన తర్వాత బీబీజోడీ విజేతకు, అసోసియేషన్ సభ్యురాలిగా సన్మానం చేయాలని సెక్రటరీ నిర్ణయించడంతో అప్పటినుంచి కొంతమంది తన పైన పాత విషయాలను తవ్వుతూ చాలామంది గొడవలు చేస్తున్నారని.. ఈ గొడవకు అన్నిటికీ కారణం జానీ మాస్టర్ పైన కేసు పెట్టడమే అంటూ , తన పైన ఇలాంటి కక్షపూరితమైన పనులు చేస్తున్నారని శ్రష్టివర్మ తెలియజేసింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you