Wednesday, July 15, 2026
HomeLATESTActress Indraja: పిలిచి మరీ అవమానిస్తారా.. కంటతడి పెట్టిన ఇంద్రజ!

Actress Indraja: పిలిచి మరీ అవమానిస్తారా.. కంటతడి పెట్టిన ఇంద్రజ!

Actress Indraja: ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని పిలిచి మరీ అవమానిస్తారా అంటూ కంటతడి పెట్టుకుంది.

on
- Advertisement -banner Ad

Actress Indraja: టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఇంద్రజ ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలలో జడ్జిగా వ్యవహరించడమే కాకుండా పలు చిత్రాలలో కూడా నటిస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ షో నుంచి ఎప్పుడైతే రోజా వెళ్లిపోయారో.. అప్పటినుంచి ఆ ప్లేస్లో నటి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు. అలా జబర్దస్త్ షోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది ఇంద్రజ. ఈ షో లోని కంటెస్టెంట్లతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారికి అడపా దడపా సహాయం చేయడంలో కూడా ముందుంటుంది ఇంద్రజ.

పిలిచి మరీ అవమానించాలా అంటున్న ఇంద్రజ..

అప్పుడప్పుడు ఈ షోలలో ఇంద్రజ(Actress Indraja) డాన్స్ వేయడం , ఏదైనా స్కిట్ లో భాగంగా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ షోలలో జడ్జిలను కూడా రోస్ట్ చేస్తూ ఉండడం సర్వసాధారణమే. అలా రోజా ఇంట్లో ఎలా ఉంటుంది? రష్మీకి వివాహమైతే ఎలా ఉంటుంది? నాగబాబు సెట్లో ఎలా ఉంటారు ? వంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను నవ్వించడానికి కంటెస్టెంట్స్ సైతం స్కిట్స్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా ఇంద్రజ ఇంట్లో ఎలా ఉంటారు అనే స్కిట్లలో భాగంగా బుల్లెట్ భాస్కర్, ఫైమా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్కిట్ చేశారు.

- Advertisement -
Advertisement

also read:Mrunal Thakur:క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్..!

స్కిట్స్ ఇలా ఎవరైనా చేస్తారా?

ఇందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారగా.. ఈ ప్రోమోలో అందరూ బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ చివరిగా ఇంద్రజ తన మీదే స్కిట్ చేయడంతో ఆమె మండిపడ్డారు. ఇలా పిలిచి మరీ అవమానించాలా అంటూ ఎమోషనల్ గా కంటతడి పెట్టినట్టు చూపించారు. ముఖ్యంగా ఫైమా ఇంద్రజా లాగా డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇవ్వడం, ఆమె మాటలను సాగదీస్తూ మాట్లాడడం వంటివి చేయగా అక్కడున్న వారు అందరూ నవ్వగా ఇంద్రజ మాత్రం చాలా బాధపడినట్టుగా కనిపిస్తోంది. ఈ విషయం పైన ఇంద్రజ మాట్లాడుతూ నేను ఇలా సాగదీసి మాట్లాడతానా? పిలిచి మరి నన్ను అవమానిస్తున్నారు.. ఇది కరెక్టేనా.. ఆలోచించుకోండి..స్కిట్ చేస్తే నేను కూడా నవ్వాలి కదా అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది ఇంద్రజ.

- Advertisement -
Advertisement

also read:Shrasti Verma:జానీ మాస్టర్ టీమ్ నాపై కక్ష కట్టారు.. శ్రష్టివర్మ షాకింగ్ కామెంట్స్

నిజమా లేక టీఆర్పీ స్టంటా?

అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో అయితే వైరల్ గా మారింది. అయితే ఇదంతా కూడా కేవలం టిఆర్పి రేటింగ్ కోసం చేసిన స్టంటా లేక నిజంగానే ఇంద్రజ ఇలా ఎమోషనల్ గా మాట్లాడిందా అనే విషయం తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే ఇందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you