Friday, July 17, 2026
HomeLATESTVrushakarma:నాగ చైతన్య 'వృషకర్మ'కు భారీ ఓట్ట్ ఆఫర్..రిలీజ్‌కు ముందే సెన్సేషనల్ డీల్..!?

Vrushakarma:నాగ చైతన్య ‘వృషకర్మ’కు భారీ ఓట్ట్ ఆఫర్..రిలీజ్‌కు ముందే సెన్సేషనల్ డీల్..!?

Vrushakarma:అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేస్తోంది.

on
- Advertisement -banner Ad

Vrushakarma:”తండేల్” విజయంతో మంచి జోష్ లో ఉన్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ “వృషకర్మ” చిత్రంలో నటిస్తున్నారు. విరూపాక్షతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అడ్వెంచర్ మిస్టరీ ద్రిల్లింగ్ అంశాల కలయికగా రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఓటిటి హక్కులకు భారీ ధర :

ఫిలింనగర్ వర్గాలల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..”వృషకర్మ”  (Vrushakarma)నాన్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. శాటిలైట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కలిపి సుమారు 50 కోట్లకు ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడినప్పటికీ ఇటీవల కాలంలో జరిగిన భారీ నాన్ థియేట్రికల్ డీల్స్ లో ఇది ఒకటిగా సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి విడుదలకు ముందే మంచి బిజినెస్ జరగడం నిర్మాతలకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. హక్కుల ద్వారానే నిర్మాణ వ్యయంలో గణనీయమైన భాగం రికవరీ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో సినిమా విడుదలకు ముందే వ్యాపార పరంగా బలమైన స్థాయిలో నిలిచిందని చర్చసాగుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT : ఓటీటీలోకి రాబోతున్న టోవినో థామస్ మూవీ!

గ్లింప్స్ తో పెరిగిన అంచనాలు:

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో నాగ చైతన్య అర్జున్ అనే నిధి అన్వేషకుడిగా పాత్రలో కనిపించారు. గుహల్లో దాగి ఉన్న రహస్యాలు, పురాతన నిధి నిక్షేపాలు, వాటి వెనుక ఉన్న మిస్టరీ అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయని గ్లింప్స్ ద్వారా సంకేతాలు లభించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులలో మంచి ఆసక్తి కలిగించాయి.నాగచైతన్య సినీ కెరియర్ లోని ఈ సినిమా బెస్ట్ గా ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.  ట్రైలర్ తో మరింత హైప్ రావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది విడుదల చేసిన చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Indraja:ఇంద్రజకు జబర్దస్త్ బంపర్ ప్యాకేజ్..ఒక్క ఎపిసోడ్‌కే హీరోయిన్స్ కి మించిన పారితోషికం!

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు :

సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ.. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో గ్లింప్స్ కు వచ్చిన స్పందన సినిమాపై ఏర్పడిన అంచనాలు నాన్ థియేట్రికల్ బిజినెస్ బై వినిపిస్తున్న వార్తలు “వృషకర్మను” విడుదలకు ముందే చర్చనీయాంసంగా మార్చేశాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you