Varanasi:సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “వారణాసి”. ఈ చిత్రం విడుదలకు ముందే సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నప్పటికీ థియేట్రికల్ హక్కులు, ఓటిటి డీల్ కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వివరాలపై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
రాయలసీమ హక్కులపై భారీ డిమాండ్ :
సినీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రాయలసీమ ప్రాంత థియేట్రికల్ వారణాసి(Varanasi) సినిమా హక్కులకు నిర్మాతలు భారీ ధరను ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మహేష్ బాబు చిత్రాలకు ఆ ప్రాంతంలో సాధారణంగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువ వసూలు నమోదు అవుతూ ఉంటాయి. అయినప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసారి రికార్డు స్థాయి ధరను కోరుతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అంత మొత్తాన్ని చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదని.. తమ లెక్కల ప్రకారం కొంత తక్కువ ధరలోని ఈ హక్కులను కొనుగోలు చేయడం వ్యాపార పరంగా సురక్షితమైన భావిస్తున్నట్లు సమాచారం.
ALSO READ:Jabardasth:ప్రభుత్వ ఉద్యోగం స్టార్ డం అందుకున్న కమెడియన్.. ఇప్పుడు బిగ్ బాస్ 10లోకి కూడా..?
ఓటిటి హక్కుల పైన చర్చ :
థియేట్రికల్ హక్కుల తో పాటు ఓటిటి హక్కుల విలువలు కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం చిత్ర బృందం ఓటీటీలకు అత్యంత భారీ ధరను ఆశించినప్పటికీ ప్రముఖ డిజిటల్ సంస్థలు అంతస్థాయిలో ముందుకు రావడం లేదు అంటూ సమాచారం అందుతుంది. దీంతో ఈ డీల్ పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Vijay Sethupathi:ఫోన్ బూత్ ఆపరేటర్ నుంచి హీరో వరకు విజయ్ సేతుపతి కథ కన్నీళ్లు తెప్పిస్తుంది!
భారీ బడ్జెట్ .. భారీ అంచనాలు :
ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అందువల్ల పెట్టుబడికి తగిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వసూలు రావాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతుందని నమ్మకంతో రాజమౌళి తన ప్రణాళికలను అమలు చేస్తున్నారని సినీ వర్గాలల్లో చర్చ సాగుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిజినెస్ గణాంకాల ప్రకారం డీల్ విలువలు అధికారికంగా ధ్రువీకరించబడలేదు. చిత్రానికి సంబంధించిన అసల వ్యాపార ఒప్పందాలు, విడుదల వివరాలు, నిర్మాతలు ప్రకటించిన తర్వాత వాటి పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం మహేష్ – రాజమౌళి కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలే ఈ సినిమాను ఎక్కువగా వార్తల్లో నిలిపేలా చేస్తున్నాయి అంటున్నారు సినీ ప్రముఖులు..!!




