Thursday, July 23, 2026
HomeLATESTRajamouli:రాజమౌళి ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి పేరు ఏంటో తెలుసా?

Rajamouli:రాజమౌళి ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి పేరు ఏంటో తెలుసా?

Rajamouli: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తాజాగా తన ఫస్ట్ లవ్ రివీల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా తన మొదటి లవ్ ఫై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Rajamouli:టాలీవుడ్ పరిశ్రమను దేశవ్యాప్తంగా గర్వింపపడేలా చేసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రాజమౌళి మాత్రమే అని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆయన ఎంచుకునే కథ, నటీనటుల ఎంపిక కూడా చాలా భిన్నంగానే ఉంటుంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను మాత్రమే తెరకెక్కించిన రాజమౌళి(Rajamouli).. ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి పేరు వినిపిస్తోంది. అందుకు కారణం మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాని తెరకెక్కించడం. అలాంటి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన మొదటి ప్రేమ గురించి తెలియజేశారు.

ఫస్ట్ లవ్ రివీల్ చేసిన రాజమౌళి..

రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఇంటర్ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి మా క్లాసే.. ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం నాకు రాలేదు, ఆ అమ్మాయి అంటే ఇష్టమని మా క్లాస్లో ఉండే అబ్బాయిలందరికీ తెలుసు. నన్ను ఏడిపించే వాళ్ళు. అతి కష్టం మీద ఆ అమ్మాయితో ఒక సంవత్సరం చివరిలో ఒకసారి మాట్లాడాను.. అతి కష్టం మీద ఆమెను భారతి అని పిలిచి ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగాను.. అలా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసి ఒక లుక్ ఇచ్చింది .నేను చాలా రోజులుగా ఆ లుక్కు కోసమే ఎదురు చూశానని అర్థమయ్యింది. ఆ ఎక్స్ప్రెషన్ తాను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తెలియజేశారు రాజమౌళి.

- Advertisement -
Advertisement

ALSO READ:Ranabali:విజయ్ దేవరకొండ – రష్మిక రణబాలి సినిమా పోస్ట్ పోన్!

రమాను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న రాజమౌళి..

రాజమౌళి ఇంటర్ మొదటి సంవత్సరం ఏలూరు ప్రాంతంలో చదివారు. ఈ సంఘటన కూడా అప్పుడే జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత చదువు ఆపేసిన రాజమౌళి కొన్నేళ్ళకు ఇంటర్ సెకండియర్ పూర్తిచేసి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాలలో పనిచేస్తున్నప్పుడే తన కుటుంబానికి దగ్గరైన అమ్మాయి, ఫ్యాషన్ డిజైనర్ రమాని ప్రేమించి మరీ రాజమౌళి వివాహం చేసుకున్నారు. అలా ఇప్పుడు రాజమౌళి కుటుంబం అంతా కూడా కలిసి రాజమౌళి తెరకెక్కించే సినిమాలలో భాగమవుతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT: ఊపిరి బిగపట్టే ట్విస్టులు..నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న థ్రిల్లర్!

వారణాసితో ప్రేక్షకుల ముందుకు రానున్న రాజమౌళి..

ఓటమి ఎరుగని డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you