Irumudi: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. రవితేజ కి జోడిగా ప్రియా భవాని శంకర్ నటించింది. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో నటించింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా తండ్రీ కూతురు మధ్య ఉన్న బాండింగ్ ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు.
థియేటర్లలో దూసుకుపోతున్న చిత్రానికి పెద్ద సమస్య..
ఇరుముడి సినిమాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పాటుగా థియేటర్స్ కూడా భారీగానే హౌస్ఫుల్ అవుతున్నాయి. సోమవారం రోజున సినిమా సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేయగా. . అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇటువంటి సందర్భంలోని ఇరుముడి సినిమా ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై టీచర్స్ ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా లో కొన్ని సీన్స్ తొలగించాలని టీచర్స్ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.
also read:Madhuri Rathod:”జనాలకి ఆ వీడియోలు అంటేనే ఇంట్రెస్ట్”..మాధురి రాథోడ్ సెన్సేషనల్ కామెంట్స్..!
ఉపాధ్యాయ బృందం మండిపాటు..
ముఖ్యంగా ఉపాధ్యాయ ప్రతిష్టను దిగజార్చేలా ఇందులో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు సినిమాలు చూపించారని, ఆశించిన వెంటనే తొలగించాలని టీచర్స్ సైతం డిమాండ్ చేస్తున్నారు. సీలేరు జడ్పీ హైస్కూల్ పేరుతో పాటు, ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్ ను చూపిస్తూ.. ఉపాధ్యాయురాలి పాత్రను నెగటివ్గా చూపించడం పైన చాలామంది టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఆ సీన్స్ ని వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు బసవ లింగరావు, చెన్నుపాటి మంజుల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది.
also read:Shiva Nirvana:ఇరుముడి నక్షత్ర గురించి డైరెక్టర్ శివ కామెంట్స్..!
చిత్ర బృందం స్పందిస్తుందా?
ఇరుముడి(Irumudi) చిత్రంలో ప్రభుత్వ పాఠశాల టీచర్ పాత్రను సమాజానికి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్లేలా చూపించారని ఉపాధ్యాయ నేతలు సైతం ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఇరుముడి చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇరుముడి సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రవితేజ చాలాకాలం తర్వాత 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా ఇరుముడి సినిమా నిలిచింది. ఇప్పుడు అలాంటి సినిమా పైన ఇలాంటి వివాదం రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మరి చిత్ర బృందం ఈ సీన్స్ ని డిలీట్ చేస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.




