Samantha:సామాన్యులే కాకుండా సినీ సెలబ్రిటీలు బాగా కూడా సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు చాలా మంది మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరూ కూడా బరువైన వస్తువులు మోయడం, పరుగులు పెట్టడం వంటివి చేయరు. కొంతమంది మహిళలు యోగాసనాలు, మనశ్శాంతిగా ఉండడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం సులభమైన యోగాలు కూడా చేయవచ్చని వైద్యులు కూడా చెప్పడంతో తమ శరీరానికి అనుగుణంగా సులభంగా ఉండే యోగాలను చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది సెలబ్రిటీలు చేసే వర్కౌట్ లను చూసి చాలామంది మహిళలు ఆశ్చర్యపోతూ ఉంటారు.
జిమ్ వర్కౌట్స్ తో షాక్ ఇచ్చిన సమంత..
అలా ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన సమంత(Samantha) మాత్రం ప్రెగ్నెంట్ సమయంలో హెవీ వర్కౌట్స్ చేస్తూ బరువులు ఎత్తుతూ ఉన్న ఫోటోలను షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాను కడుపుతో ఉన్నప్పటికీ వర్కౌట్ చేయడం గురించి ప్రస్తావిస్తూ తాను వైద్యుల సలహా తీసుకున్నానని అలాగే తన ట్రైనర్ శిక్షణలోనే తాను ఇలాంటి వర్కౌట్స్ చేస్తున్నాను అంటూ తెలియజేసింది సమంత.. నేను చాలా సంవత్సరాలుగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా.. నా డాక్టర్ అనుమతితోనే గర్భధారణ సమయంలో దానిని కొనసాగిస్తున్నాను. నా ట్రైనర్ కూడా ప్రినేటల్ ట్రైనింగ్ లో స్టడీ ఫైట్ అయ్యారని తెలిపింది.
also read:Hyper Aadi:ఈశ్వర్ సాయి-మాధురి పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ !
వైద్యుల సమక్షంలో వర్కౌట్స్..
చేసేవన్నీ నా శరీరం, నా అనుభవం , నా గర్భధారణకు అనుగుణంగా మార్పులు చేసుకున్నవి. ప్రతి గర్భధారణ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నా వర్క్ అవుట్లను గర్భంతో ఉన్న మహిళలు, డాక్టర్ అనుమతి లేకుండా సరైన ట్రైనర్ లేకుండా చేయవద్దు అంటూ తెలిపింది. గర్భధారణ సమయంలో వ్యాయామం చేసే ముందు కచ్చితంగా వైద్యులతో మాట్లాడి అర్హత ఉన్నవారితో శిక్షణ తీసుకోండి.. అంటూ సమంత ఒక నోట్ రాసుకు వచ్చింది. దీంతో సమంత డెడికేషన్ పైన చాలామంది నెటిజన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read:Kriti Sanon:ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేసిన కృతి సనన్..!
ఈ ఏడాది చివర్లో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత..
చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం ప్రముఖ డైరెక్టర్, నిర్మాతగా పేరు సంపాదించిన రాజ్ నిడిమోరును ప్రేమించి, రెండో వివాహం చేసుకుంది సమంత. దీంతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలో సమంత తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సమంత ఒక ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నాననే విషయాన్ని తెలియజేసింది. మరి మొదటి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఎలాంటి సినిమాతో మళ్లీ కం బ్యాక్ ఇస్తుందో చూడాలి.
View this post on Instagram




