Hyper Aadi:ఫోక్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఎంత కూడా ఒకటి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ జంట పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి ఒకే గదిలో కనిపించడం.. సరిగ్గా అదే సమయంలోనే ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో, ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటికే చాలామంది స్పందించారు. ముఖ్యంగా ఈశ్వర్ సాయి కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది.
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లపై హైపర్ ఆది కామెంట్స్..
ముఖ్యంగా మాధురి గదిలో ఎందుకు ఉన్నాను అనే వివరణ ఇస్తూ.. వరుసగా వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈశ్వర్ సాయి తన భార్యను కూడా తప్పుపడుతూ.. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయి గురించి నిందలు వేయడం తప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా పలు రకాల పోస్టులు షేర్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(Hyper Aadi) కూడా స్పందించినట్లు తెలుస్తోంది. తన తోటి జబర్దస్త్ కమెడియన్ అయిన శాంతి స్వరూప్ తో కలిసి ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
also read:Kriti Sanon:ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేసిన కృతి సనన్..!
అలా చేయడం ముమ్మాటికి తప్పే..
హైపర్ ఆది మాట్లాడుతూ..” ఒకరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు.. అందులో కూడా అమ్మాయిల గురించి తెలియకుండా ఏ విషయం కూడా మాట్లాడకూడదు. ఇటీవల ఒకరి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండానే ట్రోల్ చేయడం చాలా కామన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఫోక్ డాన్సర్ మాధురి గురించి వస్తున్న వార్తలు తనని బాధపెట్టాయని, వాళ్ల పర్సనల్ విషయాలను బయట పెట్టడం కూడా తప్పు. వారు ఎన్నో ఏళ్లుగా కలిసి రీల్స్ పాటలు చేస్తున్నారు. వారిద్దరు ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయ్యారు అనే విషయాన్ని పక్కన పెడితే తెలిసో తెలియకో చేసిన పొరపాటును వీడియో తీసి మరీ పబ్లిక్ చేయడం మంచిది కాదు అంటూ తెలిపారు.
also read:Kriti Sanon:ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్ వేసిన కృతి సనన్..!
అసలు విషయం తెలియకుండా మాట్లాడడం తప్పు..
ఇప్పుడు ఈశ్వర్ సాయికి వివాహమయ్యింది. ఆ అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు. ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది . అలాంటి అమ్మాయి పరువు తీయడం సరైనది కాదు. ఆ అమ్మాయికి వివాహం అవుతుందా? ఆ అమ్మాయి మాత్రమే కాదు.. ఎవరి గురించి కూడా ఇలా తప్పుగా మాట్లాడకూడదు. అమ్మాయిల గురించి తెలియకుండా ఏది అనకూడదు అంటూ హైపర్ ఆది తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హైపర్ ఆది చేసిన కామెంట్స్ కి పలువురి నెటిజన్స్ సపోర్ట్ గా కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గానే కాకుండా, సినిమాలలో కూడా సంపాదిస్తున్నారు.
View this post on Instagram




