Wednesday, August 26, 2026
HomeLATESTAnil Ravipudi: వారణాసి తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ సినిమానా?

Anil Ravipudi: వారణాసి తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ సినిమానా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నారని వార్తలకు తాజాగా అనిల్ రావిపూడి స్పందించారు.

on
- Advertisement -banner Ad

Anil Ravipudi:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ చిత్రం వారణాసిలో నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలోనే వారణాసి తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఏంటా అని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

మహేష్ బాబుతో అనిల్ రావిపూడి మూవీ..

ఇటువంటి సందర్భంలోనే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన అనిల్ రావిపూడి(Anil Ravipudi).. మహేష్ బాబుతో కలిసి మరొకసారి సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వీరు కాంబినేషన్ రిపీట్ కాబోతోందనే వార్తలకు మరింత ప్రధాన్యత కనిపిస్తోంది. ఇందుకోసం చర్చలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

- Advertisement -
Advertisement

also read:Samantha:వర్కౌట్స్ తో షాక్ ఇస్తున్న సమంత..!

వార్తలపై స్పందించిన అనిల్ రావిపూడి..

అయితే ఈ ప్రచారంపై అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా స్పందించారు. మహేష్ తనకు ఎంతో ఆత్మీయుడని, ఆయన పైన తనకి ఎప్పుడూ కూడా అపారమైన గౌరవం, ప్రేమ ఉంటుందని వెల్లడించారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తెలిపారు.. అది నిజము కాదు దయచేసి ఇలాంటి రూమర్స్ ఎవరూ కూడా నమ్మకండి.. ప్రచారం చేయకండి అంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. దీంతో అటు మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అనే వార్తలకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Hyper Aadi:ఈశ్వర్ సాయి-మాధురి పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ !

అనిల్ రావిపూడి మూవీస్..

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే మహేష్ బాబు పూర్తిగా వారణాసి సినిమాపైనే ఫోకస్ చేశారు . డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం జనవరి 13న విడుదల అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో కళ్యాణ్ రామ్, వెంకటేష్ , కృతి శెట్టి, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ అనిల్ రావిపూడి కాంబినేషన్లో మహేష్ బాబు మళ్లీ సినిమా చేయాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి మహేష్ బాబు కెరీర్ లోనే వారణాసి చిత్రం చాలా కీలకంగా మారనుంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you