Thursday, August 27, 2026
HomeLATESTToxic :నెగిటివ్ టాక్‌తో ‘టాక్సిక్’.. అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయిగా!

Toxic :నెగిటివ్ టాక్‌తో ‘టాక్సిక్’.. అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయిగా!

Toxic :యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి.

on
- Advertisement -banner Ad

Toxic :పాన్ ఇండియా హీరో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘టాక్సిక్’. ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. థియేటర్లలో రిలీజ్ అవ్వకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు ఇది సినిమానేనా? ఇలాంటి సినిమాను ఎవరైనా తెరకెక్కిస్తారా? ఈ సినిమా అంతా బూతులే బూతులా ఉంది అంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ప్రారంభమైంది.

‘టాక్సిక్’పై నెగిటివ్ టాక్ :

‘కేజీఎఫ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యష్.. ‘టాక్సిక్’తో( Toxic) మాత్రం ఊహించని నెగిటివ్ టాక్‌ను ఎదుర్కొంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న విమర్శలు యష్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరుగుతోంది. మరోవైపు, యష్ ఈ కథను విన్నప్పుడు ఎందుకు ఓకే చేశారనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. యష్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకు ఇలాంటి బోల్డ్ కంటెంట్ అవసరమా అంటూ కొందరు అభిమానులు, నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి మరో భారీ కమర్షియల్ హిట్ ఆశించిన అభిమానులకు ‘టాక్సిక్’ ఫలితం షాక్‌కు గురిచేస్తోంది.

- Advertisement -
Advertisement

also read:GV Narayana Rao:సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు మృతి!

ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్ము దులిపేసిన టాక్సిక్:

ఫుల్ టు ఫుల్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘టాక్సిక్’ మొదటి రోజు కలెక్షన్స్ దుమ్ము దులిపేసింది. భారతదేశంలో ఫస్ట్ డే దాదాపు రూ.101.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాగా, ప్రపంచవ్యాప్తంగా ‘టాక్సిక్’ క్రాస్ ఏకంగా రూ.140 కోట్లకు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Anil Ravipudi: వారణాసి తర్వాత ఆ డైరెక్టర్ తో మహేష్ సినిమానా?

భాషలవారీగా ‘టాక్సిక్’ మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి:

హిందీ: రూ.55.00 కోట్లు

- Advertisement -
Advertisement

కన్నడ: రూ.23.00 కోట్లు

తెలుగు: రూ.16.00 కోట్లు

తమిళం: రూ.5.50 కోట్లు

మలయాళం: రూ.1.30 కోట్లు

మొత్తం ఇండియన్ నెట్ వసూళ్లు రూ.101.10 కోట్లుగా తెలుస్తుంది.

నెగిటివ్ టాక్.. భారీ ఓపెనింగ్ :

‘టాక్సిక్’ భారీ ఓపెనింగ్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకున్నాడు యష్. టాక్ ఎంత నెగెటివ్‌గా వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేశాయి. అయితే ఇదంతా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చినవే ఎక్కువగా ఉండి ఉంటాయని, రెండో రోజు ఆ కలెక్షన్స్ తగ్గిపోతాయని అంతా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ‘టాక్సిక్’ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో. సోషల్ మీడియాలో ఇప్పుడు ‘టాక్సిక్’కు సంబంధించిన కలెక్షన్ డీటెయిల్స్, అదేవిధంగా టాక్ బాగా ట్రెండ్ అవుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you