Thursday, August 27, 2026
HomeLATESTRanabali:విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వాయిదా..?

Ranabali:విజయ్ దేవరకొండ రణబాలి మూవీ వాయిదా..?

Ranabali: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రణబాలి సినిమా విడుదల తేదీని ఇప్పుడు మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. కానీ కొత్త డేట్ ప్రకటించారు.

on
- Advertisement -banner Ad

Ranabali:టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించిన రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబాలి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. హాలీవుడ్ నటుడు మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన రణబాలి టీమ్..

కానీ తాజాగా ఈ సినిమా వాయిదా వేయబోతున్నట్లు మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ఒక పోస్టర్ని విడుదల చేశారు. రణబాలి(Ranabali) చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ సినిమా 1878 కాలంలో రాయలసీమలోని బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకించి మరీ పోరాడినటువంటి రణబాలి అనే ఒక యోధుడి కథ అన్నట్లుగా ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో విజయ్ దేవరకొండ , రష్మిక భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో విజయ్ దేవరకొండ షర్టు లేకుండా భారీ కత్తిని భుజాన పెట్టుకొని ఉన్నట్టుగా చూపించారు. వీటికి తోడు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

- Advertisement -
Advertisement

also read:TOXIC :యష్ ‘టాక్సిక్’ ఫ్లాప్.. దిల్ రాజు తెలివికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

రష్మిక వల్లే వాయిదా..

అయితే ఈ సినిమా వాయిదా పడడానికి ముఖ్య కారణం రష్మిక అన్నట్టుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక సంబంధించి కొన్ని సీన్స్ సినిమా షూటింగ్ చేయవలసి ఉందని, మైసా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రష్మికకు గాయం కావడం చేత సర్జరీ కూడా చేశారు. దీంతో రష్మిక సుమారుగా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో దీంతో తన తదుపరి సినిమాల షూటింగ్లపై పెద్ద దెబ్బ పడింది. అందుకే రణబాలి సినిమా కూడా దసరాకి పోస్ట్ పోన్ చేసినట్లుగా వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Irumudi:”ఇరుముడి” లో నటించినందుకు నక్షత్ర ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

విజయ్ దేవరకొండ, రష్మిక సినిమాలు..

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి విజయ్ దేవరకొండ దసరా బరిలో దిగబోతున్నారు. చివరిగా కింగ్డమ్ అనే సినిమాతో పరవాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ రణబాలి చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అలాగే రౌడీ జనార్ధన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు ఈ సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే రాబోతున్నట్లు సమాచారం. రష్మిక సినిమాల విషయానికి వస్తే.. మైసా, రణబాలి చిత్రాలలో నటిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్ లో నటించిన కాక్టెయిల్ 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివాహం తర్వాత నటిస్తున్న రష్మిక ,విజయ్ దేవరకొండ రణబాలి సినిమా కూడా విజయం కావాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by RANABAALI FILM (@ranabaalifilm)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you