Thursday, August 27, 2026
HomeLATESTIrumudi:"ఇరుముడి" లో నటించినందుకు నక్షత్ర ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

Irumudi:”ఇరుముడి” లో నటించినందుకు నక్షత్ర ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

Irumudi:రవితేజ నటించిన "ఇరుముడి" సినిమాలో నక్షత్ర కీలక పాత్రకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

on
- Advertisement -banner Ad

Irumudi:ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. ‘ఇరుముడి’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో జనాలు ఈ సినిమాపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రవితేజకు చాలా కాలం తర్వాత పెద్ద బ్లాక్‌బస్టర్ అందడంతో ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇరుముడి సినిమా చూడడానికి చిన్నా పెద్దా, ముసలి వాళ్లు, మహిళలు అందరూ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే.. నిన్న రిలీజ్ అయిన ‘టాక్సిక్’ సినిమా మాకొద్దు బాబోయ్.. మాకు ఇరుముడి సినిమానే వేయండి అంటూ థియేటర్ల వద్ద ధర్నా కూడా చేస్తున్న వార్తలు వింటున్నాం. ఇలాంటి మూమెంట్‌లోనే ఇరుముడి సినిమాకు సంబంధించిన మరికొన్ని వార్తలు ఇంట్రెస్టింగ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

నక్షత్ర పాత్రకు భారీ క్రేజ్ :

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ (Irumudi)సినిమా సూపర్ డూపర్ హిట్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎంత హైలైట్‌గా మారిందో, అంతే హైలైట్‌గా చిన్నారి నక్షత్ర పాత్ర కూడా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రవితేజతో సమానంగా పోటీ పడి నటిస్తూ సినిమా హిట్‌లో తాను భాగం అయింది. అసలు ఇరుముడి సినిమాకు ఆమెను ఎలా చూసి ఎంపిక చేసుకున్నారు అనే విషయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:గురువారం టీవీ మూవీస్: ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు?

రవితేజ కూతురిగా ఆకట్టుకున్న నక్షత్ర:

ఈ సినిమాలో ఆమె పాత్ర అలాంటిది. ఎంత పక్కన పెట్టేద్దామన్నా సరే.. కళ్లు ఆమె వైపు తిప్పుకోకుండా ఉండవు. అంత చక్కగా నటించింది. రవితేజ కూతురుగా, మనమ్మ పాత్రలో ఈ సినిమాలో నటించిన నక్షత్ర అందరి మనసులను దోచేసింది. పెద్ద పెద్ద స్టార్స్ కూడా నక్షత్రపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు అయితే ఆమె హీరోయిన్ అయితే కచ్చితంగా ఫుల్ సపోర్ట్ ఇస్తాము అంటూ హామీ ఇచ్చేశారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Toxic :నెగిటివ్ టాక్‌తో ‘టాక్సిక్’.. అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయిగా!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో మొదలైన ప్రయాణం:

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉండగా దర్శకుడు ఆమెను సంప్రదించారట. ఈ విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆడిషన్స్‌కు వచ్చి మన్నమ్మ పాత్రకు ఎంపికైనట్టు అటు నక్షత్ర కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పింది.అంతేకాదు.. ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

కేవలం రూ.10 లక్షల రెమ్యునరేషన్?:

ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా కోసం ఆమె కేవలం రూ.10 లక్షలు మాత్రమే తీసుకున్నదట. తొలి తెలుగు సినిమా కావడంతో పాటు ఇంతటి ప్రాధాన్యమున్న పాత్ర దక్కడమే ఆమె లక్కీగా భావించి అసలు ఏమీ డిమాండ్ చేయలేదట. మేకర్స్ ఎంత ఇస్తే అంతే ఓకే చేసిందట.ఇప్పుడు మాత్రం ఆమె పెద్ద స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఎక్కడ చూసినా సరే నక్షత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే రెండు సినిమాలకు కూడా సైన్ చేసేసింది నక్షత్ర అంటూ టాక్ మొదలైంది. చూడాలి మరి.. ఈ చిన్నారి నక్షత్ర తన నటనతో ఇంకెన్ని సినిమాల్లో మెప్పిస్తుందో..

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you