Thursday, August 27, 2026
HomeLATESTTOXIC :యష్ ‘టాక్సిక్’ ఫ్లాప్.. దిల్ రాజు తెలివికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

TOXIC :యష్ ‘టాక్సిక్’ ఫ్లాప్.. దిల్ రాజు తెలివికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

TOXIC :యష్ నటించిన టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

on
- Advertisement -banner Ad

TOXIC :తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచింది అన్నట్లు, కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. ‘టాక్సిక్’ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత పెద్ద హంగామా నడిచిందో అందరికీ తెలిసిందే. ‘టాక్సిక్’ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుందని, ‘టాక్సిక్’ లాంటి సినిమా ఇండస్ట్రీలోకి రాబోతుందని రకరకాలుగా మాట్లాడుకున్నారు.

రిలీజ్ తర్వాత పూర్తిగా మారిన పరిస్థితి :

సీన్ కట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. అసలు ఇదేం సినిమా రా బాబు.. ఇలాంటి సినిమాను ఎవడైనా తెరకెక్కిస్తాడా? గీతూ మోహన్‌దాస్ ఎలా తెరకెక్కించింది? అంటూ బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం సినిమా గురించి నెగిటివ్‌గా మాట్లాడుకోవడం వినిపిస్తుంది.

- Advertisement -
Advertisement

సోషల్ మీడియాలో దిల్ రాజు పేరు వైరల్ :

అయితే, ఇలాంటి సందర్భంలోనే దిల్ రాజు పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ‘టాక్సిక్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సుమారు రూ.100 కోట్లకు పైగానే దిల్ రాజు కొనుగోలు చేసినట్లు బాగా వార్తలు వినిపించాయి. అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో, నెగిటివ్ టాక్ రావడంతో.. ఇక దిల్ రాజు చాప్టర్ క్లోజ్, రూ.100 కోట్లు బొక్క అంటూ కఠిన విమర్శలు వినిపించాయి.

also read:Irumudi:”ఇరుముడి” లో నటించినందుకు నక్షత్ర ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

- Advertisement -
Advertisement

దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడారా?:

కానీ దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడినట్లు తెలుస్తుంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం, ‘టాక్సిక్’తో తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలు చవిచూసిన దిల్ రాజుకు మాత్రం ఒక్క రూపాయి కూడా నష్టం రాదంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు బాగా తెలివిగా ఆలోచించి, కేవలం రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలో మాత్రమే కొనుగోలు చేశారని తెలుస్తుంది. అంటే, ఒకవేళ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోయినా, డబ్బులు రాకపోయినా, కలెక్షన్ సరిగ్గా రాలేకపోయినా.. 15 రోజుల్లోనే దిల్ రాజు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులను కేవీఎన్ ప్రొడక్షన్స్ తిరిగి ఇచ్చేయాలి అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారంట.

also read:TV:గురువారం టీవీ మూవీస్: ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు?

- Advertisement -
Advertisement

డిస్ట్రిబ్యూటర్లకు కూడా సేఫ్ జోన్? :

అలాగే తెలుగులో కొనుగోలు చేసిన వాళ్లకు కూడా ఇదే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుందని సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’ (TOXIC )సినిమా ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా.. దిల్ రాజుకు ఒక్క రూపాయి కూడా నష్టం రాదంటూ మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా దిల్ రాజు ద్వారా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయినట్లేనంటూ మాట్లాడుతున్నారు.

దిల్ రాజుపై ప్రశంసలు:

దిల్ రాజు చాలా టాలెంటెడ్.. ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ప్లాప్ అవుతుంది అనేది బాగా తెలుసు. ఒకవేళ అటు ఇటు టాక్ వచ్చినా డబ్బులు ఎలా పోగొట్టుకోకుండా ఉండాలో కూడా తెలుసు.. మహా టాలెంటెడ్ అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you