Sunday, August 30, 2026
HomeLATESTSamantha:మాతృత్వం పై సమంత కామెంట్స్..!

Samantha:మాతృత్వం పై సమంత కామెంట్స్..!

Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత తాజాగా అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా లైవ్ చాట్ సెషన్ నిర్వహించగా మాతృత్వం పై కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Samantha:సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన వారిలో నటి సమంత కూడా ఒకరు. ప్రస్తుతం తన జీవితంలో కొత్త దశను ఆస్వాదిస్తోంది సమంత(Samantha). అదే మాతృత్వ ప్రయాణానికి సంబంధించి అనుభవాలను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ లో భాగంగా సమంత తన ప్రెగ్నెన్సీకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా సంభాషణలో ఒక అభిమాని తన ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నట్లుగా చెప్పగా.. సమంత ఈ విషయం పైన స్పందించింది.

11 కిలోల బరువు పెరిగాను..

సమంత మాట్లాడుతూ.. నేను నిన్ను అర్థం చేసుకోగలను. నేను కూడా ఇప్పటికే 11 కిలోల బరువు పెరిగాను అంటూ చాలా ఫన్నీగా సమాధానాన్ని చెప్పింది. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే శారీరకమైన మార్పులు , మాతృత్వపు దశను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది సమంత. అంతేకాకుండా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నది. కొత్త ప్రదేశాలలో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు అభిమానులను మరింత ఆకర్షించాయని చెప్పవచ్చు. అలాగే సమంత తన వర్కౌట్ ల విషయం పైన కూడా కొన్ని దృశ్యాలను షేర్ చేసింది.

- Advertisement -
Advertisement

also read:Toxic movie: కళ్ళు చెదిరే ధరకు టాక్సిక్ ఓటీటీ రైట్స్!

మాతృత్వపు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న సమంత..

దీంతో మాతృత్వ ప్రయాణంతోపాటుగా తన రోజువారి జీవితంలో కొన్ని అంశాలను సమంత అభిమానులతో పంచుకోవడం ఆమెకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న సమంత.. ఏడాది డిసెంబర్లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. ఏడాది సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది . ఏకంగా ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రెగ్నెన్సీ కారణంగా సమంత ఒక ఏడాది పాటు తను తాత్కాలిక మెటర్నటీ బ్రేక్ ప్రకటించింది.

- Advertisement -
Advertisement

also read:Ritu Varma:బ్లూ అవుట్ ఫిట్ లో చందమామను తలపిస్తున్న రీతు వర్మ!

ప్రెగ్నెన్సీలో కూడా ఆపని ఫిట్నెస్.

సమంత బరువు పెరిగినప్పటికీ డాక్టర్స్ ప్రెగ్నెన్సీ ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఆక్టివ్ గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తోంది సమంత. అలాగే మరొకవైపు సమంత త్వరలో ఒక రియాలిటీ షోలో హొస్టుగా కూడా కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ అనే కార్యక్రమనికి హోస్టుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. సినిమాలకు కొంత విరామం ఇచ్చినప్పటికీ ఇతర ప్రాజెక్టుల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది సమంత. మొత్తంగా చూసుకుంటే మాతృత్వ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను సైతం అభిమానులతో ముచ్చటిస్తోంది. ఈ కొత్త దశను సమంత చాలా సంతోషంగా స్వీకరిస్తూ అభిమానులతో పంచుకుంటూ హ్యాపీగా ముందుకు సాగుతోంది.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you