Toxic movie: కన్నడ హీరో రాకింగ్ స్టార్ యశ్ తాజాగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్.. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాగా, ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఆడియన్స్ ఈ సినిమా పైన ఆశలు పెట్టుకున్నప్పటికీ థియేటర్లోకి వెళ్లిన అభిమానులను, సినీ ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ , తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా ఈ సినిమా విడుదల చేయగా .. టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది.
మొదటి షో తోనే డిజాస్టర్ టాక్..
ఇక మొదటి రోజే టాక్సిక్(Toxic movie) సినిమాకి రూ.150 కోట్ల షేర్ పైగా కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించారు. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ సినిమాకి భారీగా బిజినెస్ జరిగింది. అయితే రెండవ రోజు కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోయాయనే టాక్ వినిపిస్తోంది. ఇండియా లో టాక్సిక్ సినిమా కేవలం రూ.37 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. మొదటి రోజుతో పోలిస్తే ఏకంగా 60% పైగా భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ పై మరింత ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
also read:Ritu Varma:బ్లూ అవుట్ ఫిట్ లో చందమామను తలపిస్తున్న రీతు వర్మ!
నెగిటివ్ టాక్ వచ్చినా.. భారీ డీల్..
ఇటువంటి క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో ఓటీటి రైట్స్ పై ప్రభావం చూపుతుందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 ఈ చిత్రాన్ని రూ.230 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు వినిపిస్తోంది. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 2026 అక్టోబర్ చివరిలో ఈ చిత్రాన్ని ఓటీటి లో స్ట్రీమింగ్ తీసుకురాబోతున్నారు. త్వరలోనే దీనిపైన అఫీషియల్ గా కూడా రానుంది.
also read:Tollywood:ఆ టాలీవుడ్ యంగ్ హీరోకు వింత అలవాటు.. శ్రీనివాస్ అవసరాల షాకింగ్ కామెంట్స్!
డిజిటల్, సాటిలైట్ హక్కులను దక్కించుకున్న జీ 5..
ముఖ్యంగా జీ 5 అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మూడవరోజు ఈ సినిమా 26 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 200 కోట్ల రూపాయల గ్రాస్ అయితే దాటేసినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతాయా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. టాలీవుడ్ లో అయితే ప్రస్తుతం ఎక్కువగా ఇరుముడి సినిమాను ప్రేక్షకులు చూడడానికి మక్కువ చూపుతున్నారు. టాక్సిక్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు తక్కువ చేసినా.. ఇప్పుడు ఎక్కువ పెంచారు అనే విధంగా వినిపిస్తున్నాయి. యశ్ ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కాబోతోంది.




