Aakali Rajyam:థియేటర్లలో ఎన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినా సరే, ఓటీటీలో వచ్చే సినిమాలపై ఉండే క్రేజ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. రీసెంట్‌గా ఇప్పుడు ఓటీటీలో ఓ సిరీస్ దుమ్ము దులిపేస్తుంది. ఆ సిరీస్ పేరు మరేంటో కాదు.. ‘ఆకలి రాజ్యం’(Aakali Rajyam). సడన్‌గా ఇప్పుడు ఈ పేరు విని యూనివర్సిటీలో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ కాంబోలో వచ్చిన సినిమా ఉందే అని అనుకోకండి. పేరు అదే కానీ, సిరీస్ మాత్రం టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్. చూసిన ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేసేంత సత్తా ఉన్న సిరీస్ ఇది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. రెండు రోజుల్లోనే సూపర్ రెస్పాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసి పడేసింది.
డిఫరెంట్ పాత్రల్లో నటీనటులు :
హైలైట్ ఏంటంటే.. ఈ సిరీస్‌లో వికాస్ వశిష్ట, అదే విధంగా గీత్ సైని, రాజేష్ కన్నా డిఫరెంట్ పాత్రల్లో నటించారు. దర్శకత్వం వహించారు. టెలి ఫ్యాక్టరీ బ్యానర్‌పై వంశీ రేవన ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ కాన్సెప్ట్ ఏంటంటే.. చదువు పూర్తయిన తర్వాత నిరుద్యోగులు ఎలాంటి సమస్యలతో బాధపడతారు అనే విషయాన్ని హైలైట్ చేశారు. కళ్లకు కట్టినట్లు ఈ సిరీస్‌లో చూపించారు.
ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో వేట:
స్టోరీ ఏంటంటే.. బీటెక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అరుణ (గీత్ సైని), రమేష్ (వికాస్ వశిష్ట), అక్షయ్ (రాజేష్ కన్నా) చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో వేట ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది చాలా చక్కగా చూపించారు. ఇద్దరు అబ్బాయిలతో అరుణ ఒకే రూమ్‌లో ఉండడంతో పేరెంట్స్ అందరూ ఆమెను రాంగ్ వేలో చూస్తారు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాకపోవడంతో దొరికిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చేతి ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. అరుణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉంటుంది. అక్షయ్, రమేష్ చిన్నచితకా జాబ్స్ చేసుకుంటూ వస్తారు.
also read:Yash Toxic OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న టాక్సిక్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!
ఫ్లాప్ అయిన బిజినెస్ ప్లాన్ :
ఇదే క్రమంలో రమేష్ అప్పు చేసి మరీ ఓ బిజినెస్ ప్రారంభించాలని ప్రయత్నిస్తాడు. అయితే రైతుల కోసం రూపొందించిన అతని బిజినెస్ ఐడియా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మరోవైపు ముగ్గురి మధ్య కూడా విభేదాలు మొదలవుతాయి. ఉద్యోగాల వేటలో ఈ ముగ్గురి ప్రయాణం ఎలా సాగింది? వారి కుటుంబ బాధ్యతలు వారిపై ఎలాంటి ఒత్తిడిని తీసుకొచ్చాయి? రూమ్ షేరింగ్ కారణంగా అరుణకు కుటుంబం నుంచి ఎదురైన సమస్యలేంటి? వాటిని ఆమె ఎలా అధిగమించింది? వారు ప్రారంభించిన బిజినెస్ ఎందుకు విఫలమైంది? వంటి అంశాలను దర్శకుడు ఎంతో సహజంగా, ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించారు.
also read:Ravi Teja Irumudi:పుష్ప, బాహుబలి రికార్డ్స్ ని తుక్కు తుక్కు చేసిన రవితేజ ‘ఇరుముడి’!
ఎంటర్టైన్మెంట్‌తో పాటు మంచి మెసేజ్ :
ఒకపక్క ఎంటర్టైన్మెంట్, మరొకపక్క రియల్ కష్టాలు కళ్లకు కట్టినట్లు డైరెక్టర్ చూపించడం వల్ల ఈ సిరీస్ చాలా ఆహ్లాదకరంగా, ఎంటర్టైనింగ్‌గా, ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి మెసేజ్ నేర్చుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.




