Sunday, August 30, 2026
HomeLATESTAdarsha kutumbam :వెంకీ మామ ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా..?

Adarsha kutumbam :వెంకీ మామ ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా..?

Adarsha kutumbam : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా మళ్లీ వాయిదా పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Adarsha kutumbam :టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో విభిన్నమైన చిత్రాలతో.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోలలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్ ఆ తరువాత నటిస్తున్న భారీ ప్రాజెక్టు చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో వెంకటేష్ కి జోడిగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో భారీగానే స్పందన లభించింది.

ఆదర్శ కుటుంబం వాయిదా పడనుందా?

ఆదర్శ కుటుంబం (Adarsha kutumbam)సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కావడం చేత ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని వాస్తవంగా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న తేదీకి రావడం కష్టమే అని .. టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని..అందులో బెస్ట్ క్వాలిటీ ఇచ్చేందుకు మేకర్స్ మరింత సమయం తీసుకున్నట్లుగా వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Allari Naresh:అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక చిత్రానికి ఊహించని షాక్..!

కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

ఇందుకోసం ఈ సినిమాని ఒకటి లేదా రెండు వారాలపాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబర్ 9వ తేదీ లేదా అక్టోబర్ 16 వ తేదీన ఆదర్శ కుటుంబం సినిమా విడుదల తేదీను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. వీటికి తోడు దసరా సీజన్ కావడం చేత బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 11వ తేదీన రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా కూడా రిలీజ్ కాబోతోంది.

- Advertisement -
Advertisement

also read:Balayya vs Nagarjuna:బాలయ్య vs నాగార్జున.. వార్ తప్పదా..?

బాక్స్ ఆఫీస్ వార్..

అలాగే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా, విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి చిత్రాలు కూడా రేసులో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఇంత గట్టి పోటీ మధ్య విడుదల తేదీ ప్రకటిస్తారా లేకపోతే మార్చుకుంటారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా కలెక్షన్స్ విషయం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది కనుక చిత్ర బృందం కూడా విడుదల తేదీ పైన ఆచితూచి అడుగులు వేసేలా చూస్తోంది. మరి ఆదర్శ కుటుంబం విడుదల తేదీ పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి. అయితే ఆదర్శ కుటుంబం చిత్రంలో వెంకటేష్ పాత చిత్రంలోని కూలి నెంబర్ వన్ సినిమాలోని హిట్ సాంగ్ దండాలయ్య ఉండ్రాలయ్య సాంగ్ రీమిక్స్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఒకవేళ ఈ పాట థియేటర్లలో వస్తే మాత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you