Sunday, August 30, 2026
HomeLATESTAllari Naresh:అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక చిత్రానికి ఊహించని షాక్..!

Allari Naresh:అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక చిత్రానికి ఊహించని షాక్..!

Allari Naresh: విడుదలకు సమీపిస్తున్న సమయంలో రంభ ఊర్వశి మేనక సినిమాకి సెన్సార్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Allari Naresh:టాలీవుడ్ కామెడీ కింగ్ హీరోగా పేరు సంపాదించిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. దీంతో ప్రస్తుతం తాను నటిస్తున్న రంభ ఊర్వశి మేనక చిత్రం పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు అల్లరి నరేష్. ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది . ఈ కామెడీ ఫాంటసీ చిత్రాన్ని చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిక్కుల్లో పడ్డ రంభ ఊర్వశి మేనక మూవీ..

అయితే ఇప్పుడు తాజాగా రంభ ఊర్వశి మేనక సినిమా సెన్సార్ చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్(Allari Naresh) సరసన హీరోయిన్గా సురభి నటిస్తోంది. అలాగే విష్ణు ప్రియ, రాసి సింగ్, ప్రిషా సింగ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్స్ లో కూడా చిత్ర బృందం స్పీడ్ పెంచారు . తాజాగా సినిమా విడుదల పైన సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రంభ ఊర్వశి మేనక పాత్రలు ధరించిన దుస్తులు మితిమీరిన గ్లామర్ తో ఉన్నాయంటూ సెన్సార్ సభ్యులు సైతం పేర్కొన్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Balayya vs Nagarjuna:బాలయ్య vs నాగార్జున.. వార్ తప్పదా..?

దుస్తులే సమస్యా?

ఈ కారణంగా రంభ ఊర్వశి మేనక సినిమా విడుదలను సెన్సార్ బోర్డ్ ప్రస్తుతానికి నిలిపివేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్సరస లుక్స్ కి సంబంధించి కొన్ని దృశ్యాలు దుస్తుల రూపకల్ప వివాదాస్పదంగా మారుతున్నాయి. దేవకన్యలు ఒంటిపైన దుప్పట్టాలు లేకుండా నడుము భాగాన్ని ఎక్కువగా చూపిస్తున్నారని అది చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉందని, ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూసేవారు ఇలాంటి దుస్తులను అంగీకరించరు అంటూ సెన్సార్ బోర్డ్ చెప్పినట్లు సమాచారం. సినిమాలో రంభ ఊర్వశి మేనకా దుస్తులను మార్చాలి అని లేకపోతే సినిమా విడుదల వాయిదా అంటూ సెన్సార్ చెప్పినట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Rishab Shetty :రిషబ్ శెట్టి సెన్సేషనల్ రికార్డ్.. ఇండియాలోనే ఫస్ట్ యాక్టర్‌గా..!

చిత్ర బృందం స్పందిస్తుందా?

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన అటు అల్లరి నరేష్ గాని చిత్ర బృందం కానీ, అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ కానీ ఏ విధంగా స్పందించలేదు. ఏది ఏమైనా మరో వారం రోజులలో అల్లరి నరేష్ కామెడీ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా ఇలాంటి వివాదం లో చిక్కుకోవడం కూడా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మొత్తానికి సినిమా సెన్సార్ ఇవ్వకపోతే ఆగిపోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. అల్లరి నరేష్ గత చిత్రాలతో పోలిస్తే ఈసారి కూడా తన కామెడీ టైమింగ్ తోనే రంభ ఊర్వశి మేనక సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you