Monday, August 31, 2026
HomeLATESTRaghu master:డాన్స్ మాస్టర్ అసోసియేషన్ లో భారీ ట్విస్ట్..!

Raghu master:డాన్స్ మాస్టర్ అసోసియేషన్ లో భారీ ట్విస్ట్..!

Raghu master: డాన్సర్స్ అసోసియేషన్లో చోటు చేసుకున్న సమస్యల కారణంగా రఘు మాస్టర్ను తాత్కాలికంగా అధ్యక్షుడిగా నియమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Raghu master:గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో డాన్సర్స్ అసోసియేషన్ లో వివాదం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ అసోసియేషన్ వివాదం కీలక మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. రఘు మాస్టర్ ను టెంపరరీ ప్రెసిడెంట్గా సభ్యులు ఎన్నుకున్నట్లు తెలుస్తోంది . దీంతో రఘు మాస్టర్ మాట్లాడుతూ.. మాస్టర్ కాదు ఇక్కడ అందరూ మెంబర్సే మనకు ఒక యూనియన్ లా కావాలి. అందరూ ముందుకు వెళ్లాలి . సుమలత గారితో మాట్లాడినప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నామా ? లేదా? ఏం జరుగుతోంది అనే విషయం.. అందరికీ చెబుతున్నామా? లేదా ? అనే విషయాలను కూడా అడగాలని తెలిపారు.

తాత్కాలిక ప్రెసిడెంట్గా రఘు మాస్టర్..

అంతేకాకుండా వాళ్లకు ఫెడరేషన్ సపోర్టు లేదని, ప్రెస్ నోట్ విడుదల చేసినప్పుడు మీరు ఇచ్చే హామీ ఏంటి అంటూ రఘు(Raghu master) ప్రశ్నించారు? సుమలత చేసే పనులు నాకు నచ్చుతాయి. కానీ అందరితో ఉంటూ ట్రాన్స్పరెంట్ గా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. ఇక్కడికి ఇన్సూరెన్స్ అయి ఎవరూ రాలేదు.. ఇది మిస్ యూజ్ కాకుండా త్వరగా ముందుకు తీసుకువెళ్లాలని తాను వచ్చానని తెలిపారు. అలాగే నేను ప్రెసిడెంట్ గా పోటీ పడుతున్నానని అందరూ అనుకుంటున్నారు . నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నేనైనా శేఖర్ అయినా జానీ మాస్టర్ అయినా సరే ఎవరైనా యూనియన్ కోసమే పని చేయాలి అంటూ తెలిపారు. మనం ఫెడరేషన్ కింద ఉంటేనే మనకు వ్యాల్యూ ఉంటుంది. మనకంటూ ఒక హెడ్ ఉండాలి.. ఈ రూల్ ప్రకారం 24 క్రాఫ్ట్ కు హెడ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, టోటల్గా ఇండియాలో ఉన్న ఫెడరేషన్ అన్నిటికీ కూడా ఒకే హెడ్ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా సరే వారితో చెప్పుకునే విధంగా ఉండాలి.

- Advertisement -
Advertisement

also read:Prema:రెండో పెళ్లిపై భయపడనంటున్న సీనియర్ హీరోయిన్ ప్రేమ..!

హెడ్ లేకపోతే ఏం చేసినా గుర్తింపు ఉండదు..

రేపటి రోజున ఎవరు ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ నిర్మాతల దగ్గరికి వెళ్లి మాట్లాడగలిగాలి. 10 శాతం నుంచి 15% వరకు పెంచాలని డిమాండ్ చేయాలి. అలా కుదరదు అనుకున్నప్పుడు కనీసం 7.5 శాతమైన పెంచాలని హామీలు ఇవ్వాలి.. ఇలాంటివన్నీ కావాలి కాబట్టే ఫెడరేషన్ అనేది మనకి చాలా ముఖ్యము. 1997లో నేను కార్డు తీసుకున్నప్పుడు నాకు సెక్యూరిటీ భరోసా ఉందని తీసుకొని ఇక్కడికి వచ్చాను .. అందరి అండర్ లో ఉన్నప్పుడే సెక్యూరిటీ ఉంటుంది . సెక్యూరిటీ లేని మెంబర్షిప్ ఎవరు తీసుకోకూడదు అంటూ రఘు మాస్టర్ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Yash mother:ట్రోలర్స్ కు ఇచ్చి పడేసిన హీరో యశ్ తల్లి..!

ఇష్టపూర్వకంగానే సంతకం చేయండి..

మనకి కూడా ఫెడరేషన్ కావాలని సంతకాలు పెట్టి పెద్దలకు ఇవ్వాలి. ఇలా ఫామ్ చేసుకుంటేనే అసోసియేషన్ గుర్తింపు ఉంటుంది.. మనలో మంచి ఎవరు చేసేలా నిలబడినా మంచిదే.. మనందరినీ కూడా ఫెడరేషన్ గుర్తించాలనే తపన నాది.. 35 ఏళ్లలో ఇదే మొదటిసారి మన అసోసియేషన్ ని గుర్తించకపోవడం అంటూ తెలిపారు.. ఇక్కడికి రాని వాళ్లు వెళ్లి మిగిలిన వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలి.. ప్రతిదానికి అందరు ఇష్టపూర్వకంగానే సిగ్నేచర్ చేయండి అంటూ రఘు మాస్టర్ తెలిపారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you