Monday, October 12, 2026
HomeLATESTNaresh VK :పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. కానీ పిల్లల్ని కనాల్సిందే: నరేష్ కామెంట్స్ వైరల్

Naresh VK :పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. కానీ పిల్లల్ని కనాల్సిందే: నరేష్ కామెంట్స్ వైరల్

Naresh VK : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పెళ్లిళ్లు, విడాకులు, సహజీవనం వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

on
- Advertisement -banner Ad

Naresh VK : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పెళ్లిళ్లు, విడాకులు, సహజీవనం వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్ జంటగా నటిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నరేష్.. సినిమా విశేషాలతో పాటు సమాజంలో వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాకుండా, తమ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే నేరుగా వచ్చి చెప్పాలని చిత్ర బృందం తరఫున బహిరంగంగా సవాల్ విసిరారు.

అక్టోబర్ 16న థియేటర్లలోకి క్రేజీ కళ్యాణం :

బద్రప్ప గాజుల దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ ప్రధాన జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్ వీకే, దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 16న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాస్, దర్శకురాలు నందినీ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -
Advertisement

ALSO READ: The Paradise:ది ప్యారడైజ్ ఓటీటీలో భారీ మార్పులు!

సినిమా నచ్చకపోతే నేరుగా వచ్చి చెప్పండి:

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ‘క్రేజీ కళ్యాణం’ ఒక నిజాయతీతో కూడిన వినోదాత్మక చిత్రమని పేర్కొన్నారు. హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, సంగీతంతో ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుందని చెప్పారు. తాను ఇప్పటివరకు 300 చిత్రాల్లో నటించినప్పటికీ, ఈ సినిమాలో తన నటన ప్రత్యేకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. దర్శకుడు బద్రప్ప మంచి రచయితగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
Advertisement

ప్రస్తుతం టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో థియేటర్లకు వెళ్లాలంటే ప్రేక్షకులు ఆలోచిస్తున్నారని నరేష్ అన్నారు. సినిమా కోసం ప్రయాణం, ప్రదర్శన కలిపి గంటల సమయం వెచ్చించడంతో పాటు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని తమ సినిమా అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా నచ్చకపోతే గచ్చిబౌలిలోని విజయ కృష్ణ టవర్స్ వద్దకు వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పాలని, చిత్ర బృందం అక్కడే ఉంటుందని పేర్కొన్నారు.

ALSO READ: Rajinikanth:జైలర్ 2 సినిమా చేయడానికి కారణం ఎవరో తెలుసా..?

- Advertisement -
Advertisement

పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా తప్పులేదు:

‘క్రేజీ కళ్యాణం’ చూసిన తర్వాత పెళ్లిపై ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నరేష్ ఆసక్తికరంగా స్పందించారు. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. సహజీవనానికి కూడా ప్రస్తుతం సమాజంలో గుర్తింపు పెరుగుతోందని వ్యాఖ్యానించారు.

పెళ్లిళ్లకు భారీగా ఖర్చు చేయడం, ఆ తర్వాత విడాకుల కోసం కూడా పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి రావడం వంటి పరిస్థితులను ప్రస్తావించారు. నగరాలతో పాటు గ్రామాల్లోనూ వివాహ సంబంధాలు కుదరడం కష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు ప్రయత్నించినప్పటికీ పెళ్లిళ్లు జరగడం లేదని, జరిగినా అవి నిలకడగా కొనసాగుతాయనే హామీ లేదని అన్నారు. చివరగా పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఫర్వాలేదని, పిల్లలను కనడంపై మాత్రం ఆలోచించాలని నరేష్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you