Wednesday, October 14, 2026
HomeLATESTNayanthara:నయనతార రాజకీయ రంగ ప్రవేశం.. విఘ్నేశ్ శివన్ సంచలన ప్రకటన..!

Nayanthara:నయనతార రాజకీయ రంగ ప్రవేశం.. విఘ్నేశ్ శివన్ సంచలన ప్రకటన..!

Nayanthara:ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దర్శకుడు విఘ్నేశ్ శివన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నయనతార రాజకీయ ప్రవేశంపై ప్రశ్నలు సంధించారు.

on
- Advertisement -banner Ad

Nayanthara:తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నటీనటుల రాజకీయ ప్రవేశంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో కోలీవుడ్‌కు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా రాజకీయ రంగంలోకి వస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో నయనతార రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారంటూ తాజాగా ప్రచారం జోరందుకుంది. వచ్చే 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగవచ్చనే వార్తలు కూడా వినిపిస్తుండటంతో ఈ అంశం కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తాజాగా ఈ ప్రచారంపై నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ స్పందించారు.

కోలీవుడ్‌లో పొలిటికల్ ఎంట్రీలపై చర్చ :

తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ప్రభావం ఎప్పటినుంచో ఉంది. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల నుంచి ప్రస్తుతం విజయ్ వరకు పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ ప్రయాణం కోలీవుడ్‌లో కొత్త చర్చలకు కారణమవుతోంది. ధనుష్, శివకార్తికేయన్ వంటి హీరోలు సైతం రాజకీయాల్లోకి వస్తారంటూ పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

- Advertisement -
Advertisement

ఇదే సమయంలో నయనతార(Nayanthara) కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. 2031 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆమె రాజకీయాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు వినిపించాయి.

also read:Nabha natesh: మినీ వైట్ షార్ట్ లో నభా అందాలు.. ఫోటోలు వైరల్!

- Advertisement -
Advertisement

నయనతార ప్రాధాన్యతలు ఇవే :

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దర్శకుడు విఘ్నేశ్ శివన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నయనతార రాజకీయ ప్రవేశంపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాల గురించి అడిగారు.

దీనిపై విఘ్నేశ్ శివన్ స్పందిస్తూ, ప్రస్తుతం తమ కుటుంబ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలతో గడిపే క్షణాలు, వారి ఆలనాపాలనా బాధ్యతలు నయనతారకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కుటుంబ జీవితానికి, వృత్తిపరమైన లక్ష్యాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ జీవన విధానం తమకు ఎంతో ప్రశాంతతను, మానసిక తృప్తిని అందిస్తోందని ఆయన వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:Anupama parameswaran: బ్రేకప్ పై అనుపమ షాకింగ్ కామెంట్స్!

రాజకీయాలపై ఇప్పట్లో ఆలోచన లేనట్టే:

విఘ్నేశ్ శివన్ చేసిన వ్యాఖ్యలతో నయనతార రాజకీయ ప్రవేశంపై సాగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి స్పష్టత వచ్చినట్లయింది. కుటుంబ బాధ్యతలు, సినిమాలే తమ ప్రాధాన్యతలని ఆయన చెప్పడంతో ఆమె ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేరనే సంకేతాలు వెలువడ్డాయి.

అయితే 2031 ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో భవిష్యత్తులో ఆమె నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం మాత్రం నయనతార రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలకు ఆమె భర్త వ్యాఖ్యలు ఆసక్తికరమైన సమాధానంగా నిలిచాయి. ఈ అంశంపై సోషల్ మీడియాలోనూ చర్చ కొనసాగుతోంది. కొంతమంది నయన్ రాజకీయాలల్లోకి వస్తే బాగుంటుంది అంటుంటే..మరికొంతమంది నయన్ రాజకీయాలల్లోకి రాకుండా ఉంటేనే బెటర్ అంటున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you