Anupama parameswaran: టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. తన అందం, అభినయంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొద్ది రోజులుగా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్ తో ప్రేమాయణం నడిపిందని , ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ జరిగిందని రూమర్స్ కూడా వినిపించాయి. ముఖ్యంగా తన ప్రేమలో జరిగిన కొన్ని భయంకరమైన విషయాలను కూడా అనుపమ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.
మరోసారి బ్రేకప్ పై స్పందించిన అనుపమ..
ఇప్పుడు తాజాగా బ్రేకప్ గురించి మాట్లాడడంతో మరొకసారి సోషల్ మీడియాలో అనుపమ పేరు వైరల్ గా మారింది. గడిచిన కొద్ది రోజుల క్రితం తన మాజీ ప్రియుడు ఎంతో విచిత్రంగా ప్రవర్తించే వారని , తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా కెరియర్ను కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేశారని చెబుతూ పలు సంచలన విషయాలు బయట పెట్టింది. ఇప్పుడు తాజాగా మరొకసారి బ్రేకప్ గురించి మాట్లాడుతూ సాధారణంగా జీవితంలో ప్రేమ ఎంత అందంగా ఉంటుందో ఇద్దరు వ్యక్తులు విడిపోవడం కూడా అంతే అందమైన విషయమని తన అభిప్రాయంగా తెలియజేసింది అనుపమ.
also read: Bigg Boss:బిగ్‌బాస్ లో సంచలనం.. రెడ్ కార్డ్‌తో కామనర్ ఎలిమినేషన్!
బ్రేకప్ కూడా అందమైన విషయమే..
అంతేకాకుండా తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనని అతని కుటుంబానికి పరిచయం చేసి ఎంగేజ్మెంట్ చేయడానికి ఒప్పించారు. పెళ్లి కూడా చేసుకోవాలని చాలా హడావిడి కూడా చేశారని, అయితే తాను పెళ్లి ప్రతిపాదనను వాయిదా వేశానని, లేకపోతే ఈపాటికి మా వివాహం అయ్యి, విడాకులు కూడా జరిగేదేమో అని అనుపమ తెలియజేశారు. నా గురించి అతను ఏమైనా చెప్పొచ్చు కానీ నేను తన తప్పుల గురించి నిలదీస్తే మాత్రం ఇలా చాలా దారుణంగా మాట్లాడేవారు. ముఖ్యంగా ఆడవాళ్ళ పర్సనల్ విషయాలలో వెక్కిరించేవారు. ఇదంతా చూసి ఆడదానిగా ఎందుకు పుట్టానా అని అనిపించేది.. గతంలో తనకు ఒక పెద్ద కుటుంబం కావాలని 11 మంది పిల్లల్ని కణాలని ఆశ ఉండేది. కానీ ఇప్పుడు అసలు పిల్లలే వద్దనే స్థాయికి చేర్చారని అనుపమ ఎమోషనల్ గా మాట్లాడింది..
also read: Rajamouli :”నాకు నచ్చలేదు”..రామాయణం, మహాభారతంపై రాజమౌళి సంచలన కామెంట్స్..!
బ్రేకప్ లో కూడా సంతోషాన్ని వెతుక్కున్న బ్యూటీ..
ఒక పార్ట్నర్ తో విడిపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సహజమైన భాగమే అని ఒక బంధం ముగిసిన తర్వాత ఆ వ్యక్తి నుంచి మనం ఎలా దూరం అవుతావో ఆ తర్వాత రోజులలో కూడా మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలో అనేది ఒక మంచి వ్యక్తిగా ఎలా ఎదుగుతామో అనేది మన చేతుల్లోనే ఉంటుందని తెలియజేసింది. ఆ కోణంతో చూస్తే బ్రేకప్ అనేది బాధ కాదు అని అది ఎంతో అందంగా కనిపిస్తుందంటూ తెలిపింది అనుపమ. ప్రేమలో విఫలమైనప్పటికీ ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని మరింత అందంగా మలుచుకొని సినిమాలతో బిజీగా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ విషయాల పైన అనుపమ మాజీ బాయ్ ఫ్రెండ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.




