Sunday, October 18, 2026
HomeLATESTRanbir Kapoor:రామాయణ ఈవెంట్ లో రణబీర్ కపూర్ చేతికి కట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలుసా..?

Ranbir Kapoor:రామాయణ ఈవెంట్ లో రణబీర్ కపూర్ చేతికి కట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలుసా..?

Ranbir Kapoor:టైటానియం ఎడిషన్ ధర సుమారు రూ.35.88 లక్షలుగా, రోజ్ గోల్డ్ ఎడిషన్ ధర రూ.78 లక్షలుగా ప్రచారంలో ఉంది.రణబీర్.. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న వాచ్‌ను ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

on
- Advertisement -banner Ad

Ranbir Kapoor:టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక ఇతిహాస చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి ప్రముఖ నటీనటులు భాగమైన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటీనటుల లుక్స్, స్టైలింగ్‌పై కూడా అభిమానులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా రణబీర్ కపూర్ ధరించిన ఓ ఖరీదైన వాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాని ధర తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

రామాయణ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రణబీర్ వాచ్ :

‘రామాయణ’ అంతర్జాతీయ ట్రైలర్‌ను అక్టోబర్ 15న బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ వేడుకకు హాజరైన రణబీర్ కపూర్ (Ranbir Kapoor)కాషాయ రంగు పట్టీతో కూడిన ఓ ప్రత్యేకమైన వాచ్‌ను ధరించి కనిపించారు. ఈ వాచ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాని బ్రాండ్, ధర, ప్రత్యేకతలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్.. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న వాచ్‌ను ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -
Advertisement

also read:Kavya – Anirudh:కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

రూ.78 లక్షల విలువైన వాచ్!:

రణబీర్ కపూర్ ధరించిన వాచ్ ప్రముఖ లగ్జరీ వాచ్ బ్రాండ్ జాకబ్ అండ్ కో (Jacob & Co.) రూపొందించిన ఎపిక్ ఎక్స్ కలెక్షన్‌కు చెందిన ‘రామ్ జన్మభూమి రోజ్ గోల్డ్’ ప్రత్యేక ఎడిషన్‌గా ప్రచారం జరుగుతోంది. ఈ వాచ్ ప్రారంభ ధర సుమారు రూ.78 లక్షలుగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

ఈ వాచ్‌ను సాధారణ గడియారంలా కాకుండా భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిరం, విల్లుతో ఉన్న శ్రీరాముడి రూపం, హనుమంతుడికి సంబంధించిన ప్రతీకలను ఇందులో ప్రత్యేకంగా పొందుపరిచినట్లు సమాచారం. డయల్‌పై కనిపించే ఈ చిత్రాలు వాచ్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి.

also read:Ranabaali :రణబాలి కలెక్షన్ల లెక్క ఇదే.. తొలి రోజే ఎంత రాబట్టిందంటే?

- Advertisement -
Advertisement

టైటానియం, గోల్డ్ ఎడిషన్ల ధరలు ఎంతంటే? :

రామ్ జన్మభూమి వాచ్ సిరీస్‌లో రోజ్ గోల్డ్ ఎడిషన్‌తో పాటు ఇతర వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. టైటానియం ఎడిషన్ ధర సుమారు రూ.35.88 లక్షలుగా, రోజ్ గోల్డ్ ఎడిషన్ ధర రూ.78 లక్షలుగా ప్రచారంలో ఉంది. గోల్డ్ ఎడిషన్ ధర మాత్రం మోడల్‌ను బట్టి రూ.83 లక్షల నుంచి రూ.1.08 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

శ్రీరాముడి పాత్రకు ప్రత్యేక గుర్తింపు :

నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర తనకు ఎంతో దగ్గరైనదని, జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందని ఆయన గతంలో పలుసార్లు పేర్కొన్నారు. మొదట్లో ఇంతటి గొప్ప పాత్రకు న్యాయం చేయగలనా అనే సందేహాలు కలిగాయని, అయితే భారతీయ సంస్కృతి, రామాయణం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు ఈ అవకాశం ఉపయోగపడిందని పేర్కొన్నారు.

ఇక బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రణబీర్ కన్నడలో అభిమానులను పలకరించి ఆకట్టుకున్నారు. మరోవైపు ఆయన ధరించిన ఖరీదైన వాచ్ గురించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. సినిమాపై ఆసక్తితో పాటు రణబీర్ స్టైల్, వాచ్ ప్రత్యేకతలు కూడా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you