Sunday, November 1, 2026
HomeLATESTIrumudi Movie:రవితేజ ఇరుముడి సినిమా నిర్మాతలకు నోటీసులు..!

Irumudi Movie:రవితేజ ఇరుముడి సినిమా నిర్మాతలకు నోటీసులు..!

Irumudi Movie: సినిమా షూటింగ్లో, ప్రమోషన్స్లో మైనర్ బాలికను ఉపయోగించడం పై తగిన వివరణ ఇవ్వాలి అంటూ ఇరుముడి మూవీకి కార్మికశాఖ నోటీసులు జారీ చేసింది.

on
- Advertisement -banner Ad

Irumudi Movie:రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ చిత్రం ఇరుముడి. ఇందులో ప్రియా భవాని శంకర్ రవితేజకు జోడిగా నటించగా.. రవితేజ కూతురు పాత్రలో బేబీ నక్షత్ర నటించారు. అలాగే శ్వాసిక, సాయికుమార్ కూడా కీలకమైన పాత్రలలో కనిపించారు. ఆగస్టు నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రవితేజ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. సినిమా విడుదలై ఓటీటిలో కూడా మంచి విజయాన్ని అందుకున్న ఇరుముడి సినిమా ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది.

మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంపై నిర్మాతలకు షాక్..

ఇరుముడి(Irumudi Movie) సినిమాలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడం పైన తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలకు సైతం నోటీసులను జారీ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. బాల కార్మిక చట్టాలు నిబంధనలను పాటించారా? లేదా? అనే విషయం పైన వివరణ ఇవ్వాలి అంటూ కోరారు. బాలిక సినిమా షూటింగ్లో నటించడానికి ముందుగా జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి కూడా తీసుకున్నారా ? లేదా? బాలిక తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా? బాలిక రెమ్యూనరేషన్ లో 20% ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా? లేదా? అనే విషయంపై తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ నిర్మాతలను ప్రశ్నించారు.

- Advertisement -
Advertisement

also read:Rakul Preet Singh:”తెలుగు సినిమాలు అందుకే చేయట్ల”.. రకుల్ సెన్సేషనల్ కామెంట్స్!

విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు..

బాలికకు సంబంధించి కాల్ షిట్లు, అటెండెన్స్ రికార్డ్స్ తో పాటుగా షూటింగ్లో పాల్గొన్న సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను అలాగే బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్నటువంటి చర్యలు, భద్రత విషయాల పైన తెలియజేయాలని కార్మిక శాఖ ఆదేశాలను జారీ చేసింది. సినిమా ప్రమోషన్ ఈవెంట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలిక పాల్గొన్న విషయం పైన పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులు తెలియజేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఇరుముడి చిత్రానికి సంబంధించిన నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -
Advertisement

also read:Anupama Parameswaran:వామ్మో..తెలుగు హీరోల పై అనుపమ అభిప్రాయం ఇదా..?

చిత్ర బృందం స్పందిస్తారా?

జై లోక్సత్తా సోషల్ జస్టిస్ ఫారం చేసిన ఫిర్యాదు మేరకే ఇరుముడి సినిమాకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. ఒకవేళ నిర్మాతలు ఈ నిబంధనలను పాటించలేదని, విచారణలో తెలిస్తే మాత్రం నిర్మాతల పైన కఠినమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఒక సినిమా ప్రమోషన్స్ కోసం చైల్డ్ ఆర్టిస్ట్ ను ఉపయోగించుకుని నోటీసులు అందుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయాల పైన అటు హీరో రవితేజ గానీ, చిత్ర నిర్మాతలు గానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you