Hansika Motwani:ఈ మధ్యకాలంలో తరచూ ఏఐ ఫోటోలు, డీప్ ఫేక్ తో సెలబ్రెటీలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఏది నిజమైన ఫోటోలు వీడియోలో, నకిలీవో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. కొందరు వ్యక్తులు ఇతర వీడియోలను, హీరోయిన్ల ముఖాలకు జత చేసి మరి సోషల్ మీడియాలో వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ లైకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విషయాల పైన పలువురు సెలబ్రిటీలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలోకి హీరోయిన్ హన్సిక పేరు కూడా వినిపిస్తోంది.
హన్సిక ప్రైవేట్ వీడియో లీక్..
కోలీవుడ్, టాలీవుడ్ లో హీరోయిన్గా పేరు సంపాదించిన హన్సిక వివాహమనంతరం కొన్ని నెలలకే విడాకులు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న హన్సిక పెద్దగా సినిమాలలో కూడా కనిపించలేదు. గడిచిన రెండు మూడు రోజుల నుంచి హన్సికకు సంబంధించి ఒక ప్రైవేట్ వీడియో బయటకొచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా రెడ్డిట్, ఎక్స్ వేదికల పైన ఈ అంశంపై చాలామంది పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.. కొందరు మీమ్స్ చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. ఫోటోలను షేర్ చేయడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది..
ALSO READ:Rakul Preet Singh:శూర్పణఖ పాత్ర పై రకుల్ ప్రీతిసింగ్ షాకింగ్ కామెంట్స్..!
హన్సికపై డీప్ ఫేక్ వీడియో..
అయితే హన్సికకు(Hansika Motwani) సంబంధించిన వీడియో నిజంగానే లీక్ అయ్యిందా? లేదా అనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు. ఈ విషయాన్ని అభిమానులు, కొంతమంది నెటిజన్స్ సైతం ఖండిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం మార్నింగ్ కంటెంట్ లేదా డీప్ ఫేక్ అయ్యో ఉండవచ్చు అనే విధంగా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హన్సిక అనే కాకుండా గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు చాలామంది సెలబ్రిటీల మీద వచ్చాయి. ఈసారి కూడా వాస్తవాలు తెలియకుండా ఎవరు కూడా ఇలాంటి వీడియోలను షేర్ చేయవద్దంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ:Tamannaah:తమన్నా పై నటుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు.. ఆమె ఏమందంటే..?
హన్సిక వ్యక్తిగత జీవితం..
హన్సిక వ్యక్తిగత విషయానికి వస్తే.. 2022లో ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. దీని పెళ్లికి సంబంధించిన దృశ్యాలు కూడా ఓటీటి లో డాక్యుమెంటరీ రూపంలో ప్రసారమయ్యాయి 2026లో వీరి వ్యక్తిగత విభేదాల వల్ల ఈ జంట విడిపోయారు. అప్పటినుంచి హన్సిక సినిమాల పెద్దగా కనిపించలేదు.. ఇటువంటి సందర్భంలోనే హన్సిక ప్రైవేటు వీడియోలు అంటూ తెగ వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ విషయంపైన అటు హన్సిక గాని, కుటుంబ సభ్యులు కానీ ఎవరు స్పందించలేరు. మరి ఈ విషయం పైన ఎవరు అధికారికంగా ప్రకటన చేస్తారో చూడాలి మరి. 2003 లో హవా అనే బాలీవుడ్ చిత్రంతో చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, పవర్, గౌతమ్ నంద తదితర చిత్రాలను నటించింది. చివరిగా 2024లో కార్డియన్ అనే చిత్రంలో నటించింది.




