Tuesday, November 17, 2026
HomeLATESTOTT: థియేటర్ రిలీజ్‌లు.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న కొత్త సినిమాలివే!

OTT: థియేటర్ రిలీజ్‌లు.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న కొత్త సినిమాలివే!

OTT:ఓటీటీలతో పాటు థియేటర్లలోనూ ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. తెలుగు, డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించిన 'ఆకాశంలో ఒక తార',

on
- Advertisement -banner Ad

OTT:సినీ ప్రేక్షకులకు ఈ వారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి రానుంది. నవంబర్ మూడో వారంలో ఓటీటీ వేదికలతో పాటు థియేటర్లలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 18 నుంచి 22 వరకు కొత్త కంటెంట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ నటించిన ‘క్రేజీ కల్యాణం’ నుంచి శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హైకూ’ వరకు పలు సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి రాబోతున్నాయి. మరి ఈ వారం ఏయే ఓటీటీల్లో(OTT) ఏమేం స్ట్రీమింగ్ కానున్నాయి? థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలేంటో తెలుసుకుందాం.

ఓటీటీలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు :

ఈ వారం ఆహా వేదికగా ‘క్రేజీ కల్యాణం’ నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది.

- Advertisement -
Advertisement

అలాగే ‘కోర్ట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి నటించిన రొమాంటిక్ డ్రామా ‘హైకూ’ నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇక రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘అనుమాన పక్షి’ అదే తేదీ నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మరోవైపు చైత్ర ఆచార్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘418’ కూడా నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. అశోక్ సెల్వన్, ప్రీతి ముఖుందన్ జంటగా నటించిన ‘అన్బిల్ అవన్’ సోనీ లివ్‌లో అదే రోజు నుంచి అందుబాటులోకి రానుంది.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:డీప్‌ఫేక్‌లపై చిరంజీవి కీలక పోరాటం.. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి!

ఇతర ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు :

నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ‘HB2ME’, ‘గోర్డన్’ వంటి కంటెంట్ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘మాడెన్’, ‘పర్ఫెక్ట్ లైయర్స్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జియో హాట్‌స్టార్‌లో ‘మిస్టర్ & మిసెస్ ఆఫీస్’ వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -
Advertisement

నవంబర్ 20న జియో హాట్‌స్టార్‌లో ‘పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్’ సీజన్ 3, ‘క్వీన్’ విడుదల కానున్నాయి. జీ5లో ‘టీన్ తిగాడ’ వెబ్ సిరీస్ కూడా అదే రోజు స్ట్రీమింగ్ కానుంది. ఇక నవంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో ‘లేక్ ప్లాసిడ్ 3’ అందుబాటులోకి రానుంది.

also read:Disha Patani:టైగర్ ష్రాఫ్‌కు దిశా పటానీ స్పెషల్ మెసేజ్.. మళ్లీ ఒక్కటయ్యారా?

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే:

ఓటీటీలతో పాటు థియేటర్లలోనూ ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. తెలుగు, డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’, ‘ఈఎన్ఈ రిపీట్’, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటించిన ‘ఓ.ఎం: ఆపరేషన్ మోల్’ సినిమాలపై ఆసక్తి నెలకొంది.

అలాగే మంచు మనోజ్, మరియా ర్యాబోషప్కా నటించిన ‘డేవిడ్ రెడ్డి’ నవంబర్ 20న విడుదల కానుంది. ‘సత్యవాన్ సావిత్రి’, ‘అప్పా కుట్టి’, ‘నాన్న కుట్టి’, ‘దేత్తడి’, ‘మన డాక్టర్ బేబ్’ చిత్రాలు కూడా ఈ వారం థియేటర్లలోకి రానున్నాయి.

హిందీ, ఇతర భాషా చిత్రాలు కూడా రెడీ :

హిందీ సినిమాల విషయానికి వస్తే సన్నీ డియోల్, రవి కిషన్ నటించిన ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’, జాకీ ష్రాఫ్, శరద్ కేల్కర్ నటించిన ‘కాళీ ఖేతీ’, అమిత్ సాధ్, ఈషా డియోల్ నటించిన ‘ప్రతాప్’ విడుదలకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

మొత్తంగా నవంబర్ 16 నుంచి 22 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సినీ ప్రియులకు వినోదం పుష్కలంగా లభించనుంది. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you