Tuesday, November 17, 2026
HomeINTERVIEWSRamya Krishnan:బాహుబలి, నరసింహ సినిమా పాత్రలు వదులుకోవాలనుకున్న రమ్యకృష్ణ. !

Ramya Krishnan:బాహుబలి, నరసింహ సినిమా పాత్రలు వదులుకోవాలనుకున్న రమ్యకృష్ణ. !

Ramya Krishnan: ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ తన సినీ కెరియర్ లో ప్రత్యేకంగా తనకు గుర్తింపునిచ్చిన రెండు సినిమాలనే కథ వినకుండానే వదులుకోవాలనుకున్నానని, కానీ కొన్ని కారణాలవల్ల చేయాల్సి వచ్చిందని తెలిసింది.

on
- Advertisement -banner Ad

Ramya Krishnan:తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రమ్యకృష్ణ. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తోంది. హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ పాపులారిటీ సంపాదించుకుంది రమ్యకృష్ణ. ఆ తర్వాత ఈమె చేసిన పాత్రలన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అప్పట్లో హీరోయిన్ గానే కాకుండా సినిమాలలో విలన్ గా కూడా పలు కీలకమైన పాత్రలలో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అలా రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో ఈమె నటనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ రెండు చిత్రాలను వదులుకోవాలనుకున్న రమ్యకృష్ణ..

- Advertisement -
Advertisement

ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా విలన్ గా నటించింది రమ్యకృష్ణ(Ramya Krishnan). రమ్యకృష్ణ కెరియర్ లోనే రెండు సినిమాలను చేయడానికి మొదట ఒప్పుకోలేదట. కానీ ఆ రెండు చిత్రాలే ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అసలు ఆ సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేశారో అనే విషయాన్ని కూడా తెలియజేసింది.. రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర తన దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆలోచించాను అని తెలిపింది. ఎందుకంటే అప్పట్లో అమ్మోరు సినిమాతో సౌందర్య నా కళ్ళముందే కెరియర్ మొదలుపెట్టింది . వరుస విజయాలతో టాప్ రేంజ్ లో ఉన్నది.

also read:Teja Sajja:నిశ్చితార్థం చేసుకున్న తేజ సజ్జా..తేజ సజ్జా కాబోయే భార్య ఎవరు?

- Advertisement -
Advertisement

నా కళ్ళముందే ఎదిగిన అమ్మాయితో విలన్ గా పోటీ..

అలా ఇండస్ట్రీలో సో కాల్డ్ నెంబర్ వన్, నెంబర్ టు అనే పోటీ కూడా ఉండేది. నేను వాటిని నమ్మకపోయినా చుట్టుపక్కల వారు వాటిని గమనిస్తూ మాట్లాడుకునేవారు. సరిగ్గా ఆ సమయంలో సౌందర్యకు వ్యతిరేకంగా నేను నెగటివ్ రోల్ చేసే అవకాశం వచ్చింది.. నా కళ్ళ ముందు ఎదిగిన హీరోయిన్ కు నేను విలన్ గా చేయాలా ? నా మనసులో మరింత ఆందోళన కలిగించింది.. ఎంత గొప్పగా రాసిన పాత్ర అయినా సరే చివరకు హీరో హీరోయిన్లకే పేరు వస్తుంది. విలన్ పాత్రలకు ఎప్పుడు మూడు లేదా నాలుగవ స్థానంలో మాత్రమే అవకాశం ఉంటుందని భావించినట్లు వెల్లడించింది.

also read:Dulquer Salmaan:దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఓ తార’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ స్టోరీ!

- Advertisement -
Advertisement

తండ్రి మందలించడంతో బాహుబలిలో అవకాశం..

తనకు ఇష్టం లేని పాత్రతో సినిమా షూటింగ్ కి వెళ్లేదాన్ని. ఒకసారి కెమెరా ముందు నిలబడ్డాక మాత్రం కచ్చితంగా 100% ఆ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చి మరీ నటిస్తాను. అదే తనను చరిత్రలో నిలబెట్టేలా చేసిందని తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన బాహుబలి సినిమా వెనుక కూడా ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉందంటూ తెలిపింది.. తాను టీవీ సీరియల్స్ నిర్మిస్తున్న సమయంలో ప్రతినెల ఎపిసోడ్ టిఆర్పి రేటింగ్ ఒత్తిడితో , తన కొడుకు బాధ్యతలతో సతమతమవుతున్న సమయంలో నిర్మాత శోభు యార్లగడ్డ నాకు ఫోన్ చేసి బాహుబలి చిత్రం కోసం 40 రోజులపాటు కాల్ సీట్లు కావాలని అడిగారు, అయితే నాకు అంత సమయం లేదు అని ఫోన్ పెట్టేసాను.. కథ కూడా నేను అప్పటికి వినలేదు. అయితే ఈ విషయం తెలిసిన తన తండ్రి ఇంట్లో తన పైన గట్టిగా అరిచారు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా రాజమౌళి దర్శకత్వం చేస్తున్నారు. అలాంటి సినిమాను ఎందుకు వదులుకున్నావని తండ్రి మందలించారని.. ఆ తర్వాత శోభు యార్లగడ్డ మరొకసారి సంప్రదించి కథ వినమని కోరడంతో రాజమౌళి గారిని కలిశానని, రాజమౌళి కథ చెబుతూ ఉంటే ఒక అద్భుతం లా అనిపించింది. ఆ స్టోరీ నచ్చడంతో శివగామి పాత్రను ఓకే చేశానని తెలిపింది. మనం ఏ పాత్ర అయినా సరే ఐకానిక్ అవుతుందని ఊహించలేము కేవలం మనం ఇచ్చే 100% కష్టమే వాటిని ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లేలా చేస్తాయని తెలిపింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you