Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో రాబోతున్న హై వోల్టేజ్ గ్యాంగ్ స్టార్ చిత్రం కాకా. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారింది.. అదేమిటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తి అయినట్లుగా సమాచారం.
హీరోయిన్ తో చిరంజీవి స్పెషల్ సాంగ్..
కాకా సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ రితికా సింగ్ తో కలిసి చిరంజీవి సందడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా చిత్ర బృందం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కెవిఎన్ ప్రొడక్షన్ పతాకం పైన ఈ చిత్రాన్ని కే నారాయణ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి కూతురి పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నారు. కాకా సినిమా స్పెషల్ సాంగ్ హైదరాబాదులో ప్రత్యేక సెట్ లో నిర్మించినట్లు సమాచారం ఇందులో రితికా సింగ్ తో చిరంజీవి స్టెప్పులు అదిరిపోయేలా వేశారని వినిపిస్తున్నాయి. ఈ పాటకి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేశారు.
also read:Simran Choudhary: నడుము సొగసులతో హీట్ పెంచేస్తున్న సిమ్రాన్!
శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో సాంగ్ షూటింగ్ పూర్తి..
ఇక శేఖర్ మాస్టర్ కూడా తనదైన స్టైల్ ఎనర్జీతో చిరంజీవితో ఈ పాటలకు అదిరిపోయేలా స్టెప్పులు వేయించారు. ఈ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుందని సమాచారం, తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవికి(Chiranjeevi )జోడిగా ఇందులో ప్రియమణి నటిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.. అలాగే నివేదా పేతురాజు, గెటప్ శ్రీను, సునీల్, మురళి శర్మ తదితరులు కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. విలన్ గా ప్రముఖ నటుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారు. మలయాళ నటుడు మోహన్లాల్ అతిథి పాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
also read:Bigg boss 10:బిగ్ బాస్ నుంచి శ్వేతా నాయుడు ఎలిమినేషన్..5 వారాలకు ఎంత వచ్చిందంటే?
చిరంజీవి సినిమాలు..
గతంలో డైరెక్టర్ బాబి, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయమే ఇప్పుడు రెండవ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసేలా చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా 300 కోట్ల క్లబ్లో చేరి చిరంజీవి కెరీర్ లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాకు ప్రత్యేకించి అవార్డు కూడా లభించినట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ వశిష్టతతో కలిసి విశ్వంభర చిత్రంతో పాటుగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. మొత్తానికి చిరంజీవి సినిమాలతోనే కాకుండా నెట్ ఫ్లిక్ ఓటీటిలో కూడా ఒక టాక్ షోలో హోస్ట్ గా పాల్గొనబోతున్నారు.




