Chiranjeevi:సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. తన కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలలో నటించి మంచి క్రేజీ సంపాదించారు. అందుకే సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ప్రత్యేకించి స్థానం ఉందని చెప్పవచ్చు. అయితే ఎన్నో సందర్భాలలో చిరంజీవి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు.. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన నషాముక్త్ భారత్ పాదయాత్ర ముగింపు సభలో చిరంజీవి హాజరయ్యి కొన్ని విషయాలను బయటపెట్టారు.
మద్యం మత్తుకు బానిసలు కాకండి..
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో గాని, స్నేహితులు మధ్య ఉన్నప్పుడు గానీ కొందరు తనను మద్యం తాగాలని చాలా ఒత్తిడి చేసేవారని చిరంజీవి (Chiranjeevi)తెలియజేశారు. అయితే తాను ఆంజనేయ స్వామి భక్తుడని చెప్పి అలవాట్లను దూరంగా ఉంచేవాడినని వెల్లడించారు. సభలో యువతను ఉద్దేశించి చిరంజీవి సూటిగా స్ఫూర్తిదాయకంగా ఇలాంటి విషయాలు చెప్పడంతో చాలామంది ఒకసారే కదా ఏమవుతుందిలే అని మద్యం, డ్రగ్స్ వైపుగా వెళుతుంటారు కానీ ఆ ఒక్కసారే తమ జీవిత లక్ష్యాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది అంటూ తెలియజేశారు.
also read:Nithiin:నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ టైటిల్ వెనుక అసలు రహస్యం ఇదే!
నన్ను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు- చిరంజీవి
నేను నా లక్ష్యం మీద పూర్తి ఫోకస్ పెట్టబట్టే ఈరోజు మెగాస్టార్ గా మీ ముందు నిలబడ్డానని, మీరు కూడా మీకు ఇష్టమైన రంగాలలో రాణించి నిజమైన హీరోలుగా ఎదగాలి అని.. డాక్టర్లు, లాయర్లు, టీచర్లుగా స్థిరపడి మీ తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా పెంచాలి అంటూ వెల్లడించారు. మాదకద్రవ్యాలకు బానిసైతే కేవలం ఒక వ్యక్తి కాదు కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందంటూ తెలియజేశారు. డ్రగ్స్ బారిన పడిన వారి పట్ల సమాజం ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా చిరంజీవి చాలా చక్కగా వివరించారు. మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ , మీ ఇంట్లో వారు ఎవరైనా సరే పొరపాటున కూడా డ్రగ్స్ కు బానిసైతే వారిని అసహ్యించుకోకండి.. సానుభూతితో అండగా నిలబడి.. వాటి నుంచి బయటపడేలా చేయాలి అని తెలిపారు.
also read:Suriya:సూర్య-జ్యోతిక ప్రేమ విషయం ముందే పసిగట్టిన లైలా.. ఎలా తెలిసిందంటే?
డ్రగ్స్ రహిత భారత్ ను చూడాలి..
మన యువత సరైన మార్గంలో నడిపిస్తే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇండియాని ఆపలేదు అంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన చిరంజీవి ప్రశంసలు కురిపించారు.. డ్రగ్స్ రహిత భారత్ ని చూడాలని మోదీ లక్ష్యమే అంటూ తెలియజేశారు. ఆ ఆశయాన్ని కిషన్ రెడ్డి తన భుజాల పైన వేసుకొని ముందుకు వెళ్లడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ అభినందించారు.. ఈ పాదయాత్ర వల్ల కిషన్ రెడ్డి గొంతు ఇన్ఫెక్షన్ పైన మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారి వాయిస్ ఎక్కడికి పోలేదు ఆయన తన గలాన్ని మనందరికీ వినిపించారు ఆయన ఇచ్చిన స్ఫూర్తిని లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలి అంటూ చిరంజీవి యువతకు పిలుపునిచ్చారు.




