Sunday, November 29, 2026
HomeLATESTSpirit:‘స్పిరిట్’లో అలాంటి సీన్స్ ఉంటాయా? సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్!

Spirit:‘స్పిరిట్’లో అలాంటి సీన్స్ ఉంటాయా? సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్!

Spirit:ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది.

on
- Advertisement -banner Ad

Spirit:తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన చిత్రాల్లో కనిపించే అనూహ్య మలుపులు, షాకింగ్ సన్నివేశాల వెనుక ఉన్న ఆలోచనలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే నా లక్ష్యం:

సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కథనం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో, అందులోని కొన్ని సన్నివేశాలు అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ప్రముఖ సినీ విశ్లేషకుడు ఫరీదూన్ షహర్యార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన తన దర్శకత్వ శైలి గురించి మాట్లాడారు.

- Advertisement -
Advertisement

దశాబ్దాలుగా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే తెరపై కొత్తదనం ఉండాలని సందీప్ అభిప్రాయపడ్డారు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఉండాలని, షాక్ వాల్యూ తన కథల్లో సహజంగానే భాగమైందని తెలిపారు. ప్రత్యేకంగా అలాంటి సన్నివేశాలను సృష్టించాలని ప్రయత్నించనప్పటికీ, తన రచనా విధానంలోనే అవి భాగమవుతాయని వివరించారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ‘స్పిరిట్’లోనూ కొన్ని సన్నివేశాలు చూసి తానే ఆశ్చర్యపోతున్నానని చెప్పడం విశేషం.

వివాదాలతో పాటు భారీ విజయాలు :

2017లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’తో సందీప్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రేమ, భావోద్వేగాలు, కోపం, హింసను విభిన్నంగా చూపించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. అనంతరం ఇదే చిత్రాన్ని షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రూపొందించారు. అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించింది.

- Advertisement -
Advertisement

ఇక 2023లో రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ సందీప్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే సినిమాలోని హింస, మహిళల పట్ల చూపించిన వైఖరిపై పలువురు ప్రముఖులు విమర్శలు చేయడంతో ఈ మూవీ పెద్ద చర్చకు దారితీసింది.

also read:Chiranjeevi:మద్యం తాగితే జీవితమే నాశనం.. చిరంజీవి కామెంట్స్..!

- Advertisement -
Advertisement

ప్రభాస్‌తో ‘స్పిరిట్’.. భారీ అంచనాలు:

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ (Spirit)చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, కాంచన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది.

also read:Nithiin:నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ టైటిల్ వెనుక అసలు రహస్యం ఇదే!

2027 అక్టోబర్‌లో థియేటర్లలోకి..:

మొదట 2027 మార్చిలో విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 29, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ టేకింగ్‌కు ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you